Home » వ్యాపారంలో దూసుకుపోతున్న బాబా రాందేవ్…వ‌చ్చే ఐదేళ్ల‌లో నంబ‌ర్ వ‌న్ స్థానం..!

వ్యాపారంలో దూసుకుపోతున్న బాబా రాందేవ్…వ‌చ్చే ఐదేళ్ల‌లో నంబ‌ర్ వ‌న్ స్థానం..!

by AJAY
Ad

ప్ర‌ముక మోగా గురు రాందేవ్ జీ బాబా వ్యాపార‌రంగంలో దూసుకుపోతున్నారు. రాందేవ్ బాబా పతంజ‌లి గ్రౌప్ కు ఎగ్జిగ్యూటివ్ డైరెక్ట‌ర్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే. కాగా రాందేవ్ జీ బాబా ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. పతంజ‌లి గ్రూప్ మ‌రియు రుచి సోయా వంట‌నూనెల బ్రాండ్ కంపెనీల వార్షిక ట‌ర్నోవ‌ర్ 35వేల కోట్లుగా ఉంద‌ని ప్ర‌క‌టించారు. అంతే కాకుండా రాబోయే ఐదేళ్ల‌లో ఎఫ్ఎంసీజీ రంగంలో అగ్ర‌గామిగా ఎద‌గ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం తాము రెండో స్థానంలో ఉన్నామ‌ని వ‌చ్చే హిందూస్థాన్ యూనీలీవ‌ర్ నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంద‌ని అన్నారు.

Advertisement

Advertisement

కానీ ఐదేళ్ల‌లో తాము మొద‌టిస్థానం కు చేరుతామ‌ని బాబా రాందేవ్ వెల్ల‌డించారు. అంతే కాకుండా పతంజ‌లి ఆయుర్వేద గ్రూప్ కింద ఉన్న ఫుడ్ బిజినెస్ ను రుచి సోయా కింద‌కు బ‌దిలీ చేస్తామ‌ని చెప్పారు. పతంజ‌లి ఆయుర్వేద గ్రూప్ ఇక‌పై ఔష‌దాలు మ‌రియు కాస్మొటిక్స్ మాత్ర‌మే త‌యారు చేస్తుందని చెప్పారు. ఇదిలా ఉండ‌గా ఇది వ‌ర‌కూ పతంజ‌లిలో బిస్కెట్స్ మ‌రియు చిప్స్ లాంటి ఎన్నో ఫుడ్ ఐట‌మ్స్ అందుబాటులో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Visitors Are Also Reading