Home » అక్షర్ పటేల్ సంచలన పోస్ట్.. నాకు అన్యాయం చేశారని ఫైర్‌ ?

అక్షర్ పటేల్ సంచలన పోస్ట్.. నాకు అన్యాయం చేశారని ఫైర్‌ ?

by Bunty
Published: Last Updated on
Ad

వన్డే వరల్డ్ కప్ మరో వారం రోజుల్లోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇండియాకు చేరుకున్న విదేశీ జట్లు… వామప్ మ్యాచ్ లు కూడా ఆడేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో టీమిండియా కీలక మార్పులతో జట్టును ఫైనల్ చేసింది. ఆల్ రౌండర్ అక్షర పటేల్ స్థానంలో మరో ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకుంది బీసీసీఐ పాలకమండలి.

Axar Patel posts a cryptic Instagram story after World Cup squad snub

Axar Patel posts a cryptic Instagram story after World Cup squad snub

ఆసియా కప్ 2023 లో భాగంగా జరిగిన బంగ్లాదేశ్ మ్యాచ్ లో అక్షర్ పటేల్ గాయపడ్డాడు. దీంతో ఆసియా కప్ ఫైనల్, ఆస్ట్రేలియా 3 వన్డే ల సిరీస్ కు దూరమయ్యాడు అక్షర్ పటేల్. అయితే వన్డే వరల్డ్ కప్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో… అక్షర్ పటేల్ ఇంకా కోలుకోని కారణంగా… రవిచంద్రన్ అశ్విన్ ను జట్టులోకి తీసుకుంది టీమిండియా మేనేజ్మెంట్. అయితే దీనిపై ఆల్ రౌండర్ అక్షర పటేల్ చాలా సీరియస్‌ గా స్పందించాడు.

Advertisement

Advertisement

Will Ravichandran Ashwin replace Axar Patel in India's World Cup squad

Will Ravichandran Ashwin replace Axar Patel in India’s World Cup squad

ఏకంగా బీసీసీఐకి వార్నింగ్‌ కూడా ఇచ్చేశాడు ఆల్ రౌండర్ అక్షర పటేల్. తన సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టి.. తన నిరసనను తెలిపాడు. అన్యాయంగా తనను జట్టు నుంచి తప్పించారనే అర్థం వచ్చేలా… ఆల్ రౌండర్ అక్షర పటేల్ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. కామర్స్‌ బదులు సైన్స్‌ చదవి ఉండే బాగుండేదది.. ఇంకా ఓ మంచి పీఆర్‌ ను పెట్టుకుంటే బాగుండు అని పోస్ట్ చేసిన అక్షర్‌.. వెంటనే ఆ పోస్ట్‌ డిలీట్‌ చేశాడు. కానీ అప్పటికే ఆ పోస్ట్‌ వైరల్‌ గా మారింది. ఇక ఆ పోస్ట్‌ చూసిన క్రికెట్‌ అభిమానులు…తనకు బీసీసీఐ అన్యాయం చేసిందనే ఆల్ రౌండర్ అక్షర పటేల్ ఇలా పోస్ట్‌ పెట్టాడని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading