Telugu News » Blog » చిక్కుల్లో రోజా భ‌ర్త‌…అరెస్ట్ వారెంట్ జారీ…!

చిక్కుల్లో రోజా భ‌ర్త‌…అరెస్ట్ వారెంట్ జారీ…!

by AJAY
Ads

టాలీవుడ్ న‌టి, ఎమ్మెల్యే రోజా భ‌ర్త సెల్వ‌మ‌ణి చిక్కుల్లో ప‌డ్డారు. సెల్వ‌మ‌ణిపై అరెస్ట్ వారెంట్ జారి అయ్యింది. 2016 సంవ‌త్స‌రంలో సెల్వ‌మ‌ణి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుల్ అన్బ‌ర‌సు ఓ టీవీ ఛాన‌ల్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంట‌ర్వ్యూలో ఫైనాన్షియ‌ర్ ముకుంద్ చంద్ బోంద్రా పై ఆరోప‌ణ‌లు చేశారు. దాంతో వీరిద్ద‌రిపై బోద్రా జార్జిటౌన్ కోర్టులో పురువున‌ష్టం దావా వేశారు. కానీ ఆ త‌ర‌వాత ఆయ‌న మ‌ర‌ణించారు.

Advertisement

Advertisement

Roja Rk selvamani

Advertisement

అయితే ఆయ‌న మ‌ర‌ణానంత‌రం ఈ కేసును కుమారుడు గ‌గ‌న్ బోద్రా కొన‌సాగిస్తున్నారు. నిన్న ఈ కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది. కానీ సెల్వ‌మ‌ణి, అరుల్ విచార‌ణ‌కు డుమ్మా కొట్టారు. వారిద్ద‌రు మాత్ర‌మే కాకుండా వారి త‌ర‌పున న్యాయ‌వాదులు కూడా విచార‌ణ‌కు డుమ్మాకొట్టారు. ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రికీ బెయిలెబుల్ అరెస్ట్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది. అంతే కాకుండా ఈ నెల 23కు విచార‌ణ‌ను వాయిదా వేసింది.

You may also like