Home » తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ఏర్పాట్లు.. ఈ రూల్స్ తప్పనిసరి..!

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ఏర్పాట్లు.. ఈ రూల్స్ తప్పనిసరి..!

by Anji
Ad

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.  అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఇవాళ అనగా డిసెంబర్ 7న  మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక బాధ్యతలు స్వీకరించగానే.. రేవంత్ రెడ్డి ముందుగా ఆరు గ్యారెంటీల ఫైల్ మీదనే సంతకం చేయనున్నట్లు సమాచారం. ఆరు గ్యారెంటీల్లో మహిళలకు మూడు రకాల పథకాలు కేటాయించారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయంతో పాటు 500 రూపాలయకు గ్యాస్ సిలిండర్.. అలాగే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించిన విషయం విధితమే. 

Advertisement

ఈ పథకం కర్ణాటకలో ఎంత ఖర్చు అవుతుంది..? దానిని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తోంది అనే విషయాలను పరిశీలించేందుకు నలుగురు ఆర్టీసీ అధికారుల బృందం బెంగళూరుకి వెళ్తోంది. బెంగళూరు వెళ్లే అధికారుల బృందం రెండు రోజుల పాటు అక్కడ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకాన్ని పరిశీలించి.. నివేదికను సిద్ధం చేయనుంది. వాస్తవానికి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని దక్షిణాదిలో తొలుత తమిళనాడు రాష్ట్రం ప్రారంభించింది. అయితే అన్ని సర్వీసుల్లో అనగా ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీ, గ్రామీణ రూట్లలో దీన్ని అనుమతించలేదు. కేవలం నగర, పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో ఉండే బస్సులను అందుబాటులోకి తెచ్చింది తమిళనాడు ప్రభుత్వం.  

Advertisement

 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత ప్రయాణం గురించి హామీ ఇవ్వడమే కాదు.. అధికారంలోకి రాగానే అమల్లోకి తీసుకువచ్చింది. ఇక తమిళనాడులో నగర, పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉండగా.. కర్ణాటకలో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఈ వసతి కల్పిస్తామని ప్రకటించారు. దానిని  అమలులోకి  తీసుకొచ్చింది ప్రభుత్వం. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో దీనిపై హామీ ఇచ్చింది.  వాస్తవానికి కర్ణాటక తరహాలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే ఏడాదికి రూ.2200 కోట్లు ఖర్చు అవుతుంది. పల్లెవెలుగు బస్సులకే పరిమితం చేస్తే ఏటా రూ.750 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణ సౌకర్యం కల్పించినట్టయితే ఆర్టీసీ కోల్పోయే టికెట్‌ ఆదాయాన్ని ప్రభుత్వం రీయింబర్స్‌ చేయాల్సి ఉంటుంది.  ఎక్స్‌ప్రెస్‌ కేటగిరీ బస్సుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తే రూ.2200 కోట్ల వరకు రీయింబర్స్‌ చేయాలి.  దాదాపు ప్రతి నెలా ప్రభుత్వం ఆర్టీసీకి రూ.185 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించేందుకు ప్రస్తుతం కర్ణాటకలో జీరో టికెట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా.. ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు అనే అంశాన్ని ఈ జీరో టికెట్ ద్వారా లెక్కిస్తారు. దీనిలో భాగంగా మహిళలకు రూ.సున్నా అని ఉండే జీరో టికెట్‌ను జారీ చేస్తారు. అలా రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో నమోదు చేసి నెలవారీగా లెక్కిస్తారు. ఇక్కడ అదే పద్ధతి ప్రవేశపెడతారా లేక మరో విధానాన్ని అనుసరిస్తారా అన్నది తేలాల్సి ఉంది.  ఇక ఏది ఏమైనప్పటికీ అతి త్వరలోనే తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయనున్నారు. 

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading