Home » “అగ్నిపథ్” కాల్పుల్లో ఆర్మీ జవాన్ సోదరుడు మృతి..?

“అగ్నిపథ్” కాల్పుల్లో ఆర్మీ జవాన్ సోదరుడు మృతి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి సాయుధ బలగాల ప్రముఖుల నుంచి తీవ్రమైన ప్రతిస్పందన ఎదురైంది. రాబోయే 90 రోజుల్లో 45 వేల సైనికులను సైన్యంలోకి రిక్రూట్ చేయడానికి ఉద్దేశించిన పథకం చరిత్ర సృష్టిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో మెజారిటీ సైనిక నిపుణులు మాత్రం దీనిపై పెదవి విరుస్తున్నారు. ఈ అగ్నిపథ్ స్కీంపై ఈ రోజు దేశ వ్యాప్తంగా అగ్గి రగులుతోంది. బీహార్, మధ్యప్రదేశ్,జార్ఖండ్, హర్యానా, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతో మంది ఆర్మీలో చేరాలని ఉత్సాహంతో ఉన్న యువకులు ఆందోళన బాట పట్టారు.

Advertisement

ఈ తరుణంలో నిరసన కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్లలో నిరసనకారులు పట్టాలపై చేరి వారి నిరసన తెలియజేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రైళ్లను కూడా తగలబెట్టి ఆందోళన సృష్టిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు పట్టాలపై చేరి పలు రైళ్లకు నిప్పంటించారు. ఈ తరుణంలో అక్కడికి చేరుకున్న పోలీసులు బుల్లెట్ల వర్షం కురిపించడంతో చాలా మంది యువకులకు గాయాలు అవడమే కాకుండా ఒక ఆర్మీ జవాన్ సోదరుడు మృతి చెందాడు.

Advertisement

వరంగల్ జిల్లా దబ్బీర్ పేటకు చెందిన దామెర రాకేష్ ఒక ఆర్మీ జవాన్ సోదరుడిగా తెలుస్తోంది. తన సోదరి ఆర్మీలో పని చేస్తుండగా, ఆమె స్పూర్తితోనే గత రెండు సంవత్సరాల నుంచి రాకేశ్ ఆర్మీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యారు. రెండు సంవత్సరాలు అయినా పరీక్షలు నిర్వహించకపోగా ఈ అగ్నిపథ్ అనే స్కీం తీసుకురావడంతో సికింద్రాబాద్ వెళ్లి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆయన మృతి చెందారు.

also read;

ఉదయకిరణ్ తో తీయాలనుకున్న ‘సై’ సినిమాలో రాజమౌళి ఎందుకు హీరోను మార్చాడు..?

రామ్ చ‌ర‌ణ్ బాల‌న‌టుడిగా న‌టించిన సినిమా ఏదో మీకు తెలుసా..?

 

Visitors Are Also Reading