Home » మొటిమలతో ఇబ్బందులు పడుతున్నారా..? అయితే ఈ 6 చిట్కాలను పాటించండి..!

మొటిమలతో ఇబ్బందులు పడుతున్నారా..? అయితే ఈ 6 చిట్కాలను పాటించండి..!

by Anji

స్త్రీ పురుష బేదం లేకుండా మొటిమలు, మచ్చలు లేని చర్మాన్ని అందరూ కోరుకుంటున్నారు. టీనేజ్ ప్రారంభ దశలో ప్రారంభమయ్యే ఈ మొటిమలు కొందరినీ జీవితాంతం వేధిస్తుంటాయి. వీటి పరిష్కారం కోసం ఎన్ని క్రీమలు వాడినా ఫలితాలు లేక విసిగిపోతుంటారు. మొటిమల కారణంగా ఆత్మస్థైర్యం కోల్పోయి నలుగురిలోకి రావడానికి వెనుకాడుతారు. ఈ మొటిమలకు పరిష్కారం లేదా ముందుగా మొటిమల వల్ల ముఖం పాడవ్వకుండా ఉండాలంటే.. ముఖాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పటికే మీకు మొటిమలు ఉన్నట్టయితే ఈ 6 చిట్కాలను ఉపయోగించడం ద్వారా చర్మ సంరక్షణతో పాటు మొటిమలు, మచ్చలు లేని చర్మాన్ని పొందవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

కొబ్బరి నూనె :

Manam News

 

కొబ్బరి నూనెతో అపారమైన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బాక్టిరియల్ లక్షణాలు పుష్కలంగా ఉండడం వల్ల ఇది మొటిమలతో సహా అన్ని రకాల చర్మ సమస్యలను నయం చేస్తోంది. కొబ్బరి నూనెలో విటమిన్లు కే, ఈ అధికంగా ఉంటుంది. మొటిమలను తొలగించడానికి ఉపయోగపడడమే కాకుండా ఆరోగ్యకరమైన చర్మ కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో ముఖం మీద మొటిమల కారణంగా ఏర్పడిన మచ్చలపై మర్ధన చేయాలి. రాత్రంతా అదేవిధంగా ఉంచి, ఉదయం మంచి నీటితో శుభ్రం చేసుకుంటే ఫలితం లభిస్తుంది. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల ఫలితం త్వరగా ఉంటుంది. 

శనగపిండి  :

Manam News

 

భారతీయ వంటశాలలో కనిపించే అత్యంత సాధారణ పదార్థాల్లో శనగపిండి ఒకటి. పలు రకాల చర్మ సంబంధిత సమస్యలకు సహజసిద్ధమైన పరిష్కారమయే చెప్పాలి. ఆల్కలైజింగ్ లక్షణాలు కలిగిన శనగ పిండి. మొటిమలను తొలగించడలో సమర్థవంతంగా పని చేస్తుంది. దీనిని ఫేస్ స్క్రబ్ లుగా కూడా ఉపయోగించవచ్చు. ఓ టీ స్పూన్ శనగపిండిలో సరిపడా రోజ్ వాటర్, కొద్దిగా నిమ్మరసం కలిపి మిక్స్ చేయాలి. పేస్ట్ లా కలిపిన తరువాత.. దానిని ముఖంపై అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆతరువాత చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి. రోజూ ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది. 

ఆరేంజ్ పీల్ పౌడర్  :

Manam News

నారింజలో ఉండే సిట్రిక్ యాసిడ్ మొటిమలు, మచ్చలను సులభంగా తొలగిస్తుంది. ఆరోగ్యకరమైన మెరిసే చర్మానికి కారణం అవుతుంది. స్పూన్ నారింజ తొక్కపొడి, 1 స్పూన్ ముడి తేనె తీసుకొని మిక్స్ చేయాలి. పేస్ట్ మాదిరిగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖం, మెడ ప్రభావిత ప్రాంతాలపై అప్లై చేయాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచుకొని ఆ తరువాత మంచినీటితో శుభ్రపరుచుకోవాలి. 

కలబంద  : నా భర్త నన్ను దగ్గరకు రానివ్వడం లేదు..కారణం..!!

మానవ జాతికి ప్రకృతి ఇచ్చిన వరం కలబంద. అపారమైన ఆరోగ్యప్రయోజనాలను కలిగి ఉంది. అన్ని రకాలుగా చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. యాంటి ఆక్సిడెంట్లు, యాంటి ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు కలిగినటువంటి కలబంద మొటిమల మచ్చలు, మచ్చలు ఇన్పెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. తాజాగా కలబంద ఆకుల నుంచి వచ్చే జెల్ ని ముఖం, మెడపై అప్లై చేయాలి. రాత్రివేళలో అప్లై చేసుకొని ఉదయం శుభ్రం చేసుకుంటే మంచి ఫలితముంటుంది. 

టీట్రీ ఆయిల్  :

Manam News

టీట్రీ ఆయిల్ మొటిమలు, మొమల వల్ల ఏర్పడే మచ్చలను తొలగించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటి ఇన్ ప్లమేటరీ, యాంటి మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంటుంది. అన్ని రకాల చర్మ వ్యాధులను నివారించడంలో ఉపయోగపడుతుంది. మీరు ఏం చేయాలంటే.. మూడు, నాలుగు చుక్కల టీ ట్రీ ఆయిల్, కొబ్బరి, బాదాం నూనె మిక్స్ చేయాలి. ఆ తరువాత ఆ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తరువాత రెండు గంటల పాటు అదేవిదంగా ఉండనివ్వాలి. ముఖానికి పెట్టుకొని ఉదయం మంచి నీటితో శుభ్రం చేసుకుంటే మంచిది. ప్రతిరోజూ ఇలా చేయడంతో మంచి ఫలితముంటుంది. 

Also Read : నా భర్త నన్ను దగ్గరకు రానివ్వడం లేదు..కారణం..!!

నిమ్మకాయ : 

Manam News

మొటిమలను తొలగించడంలో నిమ్మకాయ చాలా శక్తివంతంగా పని చేస్తుంది. నిమ్మకాయల్లో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. నిమ్మరసంలో కొన్ని చుక్కల తేనె మిక్స్ చేసి మొటిమలపై అప్లై చేయాలి. 5 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత నీటిలో ముఖం కడుక్కోవాలి.  

Also Read :  రోజుకు 10 నిమిషాలు మౌనంగా ఉండడం వల్ల కలిగి ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading