Home » సమంత-నాగచైతన్య బంధాన్ని విడగొట్టింది వారేనా..?

సమంత-నాగచైతన్య బంధాన్ని విడగొట్టింది వారేనా..?

by Anji
Ad

సాధారణంగా సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న చాలా మంది ఏడాది కూడా కలిసి ఉండకుండా కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకుంటుంటారు. అంతేకాదు.. మరికొంత మంది సినీ సెలబ్రిటీలు చెప్పుడు మాటలు విని వేరొకరి పై మోజుతో వారి భవిష్యత్ ని నాశనం చేసుకుంటున్నారు. అలాగే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య సమంత కూడా ఇలాగే  విడాకులు తీసుకున్నారు. పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకే ఎవ్వరూ ఊహించిన విధంగా విడాకుల బాట పట్టి ప్రస్తుతం ఎవ్వరి దారిలో వారున్నారు. వీరిద్దరూ విడిపోవడం అటు వారి కుటుంబ సభ్యులకు, తమ అభిమానులకు కూడా ఇష్టం లేదు. 

Advertisement

గతంలో సమంత ఫ్యామిలీ మెన్ అనే ఓ వెబ్ సిరీస్ లో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ బెబ్ సిరీస్ లో సమంత నటించిన నాగచైతన్యకి కొంచెం కూడా ఇష్టం లేదు. కానీ సమంత మాత్రం నాగచైతన్య మాట లెక్క చేయకుండా ఆ వెబ్ సిరీస్ లో నటించారు. వారిద్దరి మధ్య గొడవలు వచ్చాయని గతంలో కూడా రకరకాల వార్తలు వినిపించాయి. తాజాగా వీరిద్దరూ విడిపోవడానికి గల కారణం ఇదే అని సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. అంతేకాదు.. ఇప్పటికే వీరిద్దరూ విడిపోవడానికి తనే కారణమని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.  కానీ సమంత, నాగచైతన్య మాత్రం విడిపోవడానికి గల అసలు కారణం మాత్రం చెప్పలేదు. 

Advertisement

తాజా సమాచారం ప్రకారం..సమంత ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలో సమంత- నాగచైతన్య మధ్య గొడవలు వచ్చాయట. ఆ సమయంలోనే నాగచైతన్యకి సమంత మీద ఉన్న ద్వేషంతో మరో హీరోయిన్ తో క్లోజ్ అయినట్టు సమాచారం.  ఈ హీరోయిన్ మరెవ్వరో కాదండోయ్.. శోభిత ధూళిపాల.  ఈ విషయాన్ని సమంత సన్నిహితులే  ఆమె వద్ద చెప్పారట. దీంతో చెప్పుడు మాటలు విన్నటువంటి సమంత నాగచైతన్యకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ మధ్య కాలంలో సమంత అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఆ సమయంలో వీరిద్దరూ మళ్లీ కలుస్తారనే వార్తలు వినిపించాయి. ఏం జరుగుతుందనేది కొద్ది రోజు చూడాలి మరి. 

Also Read :  సినిమాలు చేయకపోవడానికి అసలు కారణం చెప్పిన హేమ..!

Visitors Are Also Reading