Home » సినిమాలు చేయకపోవడానికి అసలు కారణం చెప్పిన హేమ..!

సినిమాలు చేయకపోవడానికి అసలు కారణం చెప్పిన హేమ..!

by Anji
Ad

తెలుగు సినిమా నటి, రాజకీయ నాయకురాలు హేమ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటించారు. 1989లో బాలకృష్ణ హీరోగా నటించిన భలేదొంగ చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయం అయ్యారు. ఇప్పటివరకు ఆమె దాదాపు 510 చిత్రాల్లో నటించారు. మూడు టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. హేమ అసలు పేరు  కృష్ణవేణి. ఆమె భర్త పేరు అహ్మద్. హేమకు ఒక కూతురు ఉంది. ఆమె ఇషాజాన్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కార్యవర్గ సభ్యురాలుగా రెండుసార్లు బాధ్యతలను నిర్వర్తించారు హేమ. ఆ తరువాత జాయింట్ సెక్రటరీగా ఎంపికయ్యారు. 

Advertisement

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు హేమ. ముఖ్యంగా బ్రహ్మనందం-హేమ కాంబినేషన్ లో వచ్చే పలు సన్నివేశాలకు అపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఏ పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోతారు హేమ. ఈ మధ్యకాలంలో సినిమాలను చాలా తగ్గించారు. పెద్ద, చిన్న హీరోలు అని తేడా లేకుండా అందరి సినిమాల్లో నటించింది. ఈ మధ్యకాలంలో హేమ సినిమాల్లో కనిపించడం లేదు. 

Advertisement

 

తాజాగా సినిమాల్లో కనిపించకపోవడానికి అసలు కారణాన్ని వెల్లడించారు హేమ. ఇక ఆ కారణంతోనే సినిమాలలో నటించడం లేదని చెప్పుకొచ్చారు. హేమ సినిమాల్లో కనిపించకపోవడంపై మీడియా ప్రశ్నించగా.. ఈ మధ్య ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను. అందులో సంపాదన ఎక్కువ అవ్వడంతో  సుఖపడటం అలవాటు అయిపోయింది. అందుకే కష్టపడాలని అనిపించడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. మా ఎన్నికల్లో చాలా హుషారుగా పాల్గొన్న విషయం విధితమే. మా అధ్యక్షుడికి నామినేషన్ వేసి ఆ తరువాత ఉపసంహరించుకున్నారు. ఇక సమయంలో ఎక్కువగా వార్తల్లో నిలిచారు హేమ. 

 Also Read :  సింగ‌ర్ స్మిత పెళ్లితో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న రిలేష‌న్ ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading