Home » ఆదిపురుష్ పై నెగటివ్ టాక్ రావడానికి గల 5 కారణాలు ఇవేనా ?

ఆదిపురుష్ పై నెగటివ్ టాక్ రావడానికి గల 5 కారణాలు ఇవేనా ?

by Anji

బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కించిన సినిమా ఆదిపురుష్. ఈ మూవీలో రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతిసనన్ జంటగా నటించారు. భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు ఎంత క్రేజ్ ఉందో.. ఆదయం ఆట ముగియగానే ఆ క్రేజ్ పోయేవిధంగా ఈ సినిమా బాగాలేదని సోషల్ మీడియాల్లో మూవీ చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఆదిపురుష్ మూవీ అందరూ చెప్పిన దానిని బట్టి ఈ సినిమా ఎందుకు బాగాలేదంటే.. ప్రధానంగా ఈ ఐదు కారణాలను చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రావణాసురుడి పాత్ర :

ఫస్ట్ అందరూ తప్పుపడుతున్నది రావణాసురిడి పాత్రను. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ పాత్రను పోషించాడు. ఈ పాత్రకు అతను సరిపోయినప్పటికీ.. దర్శకుడు సైఫ్ అలీఖాన్ ని చూపించే విధానం, తీర్చిదిద్దిన పద్దతి మాత్రం బాగాలేదంటున్నారు. ముఖ్యంగా రావణాసురుడు గొప్ప శివభక్తి పరాయణుడు.. అదేవిధంగా వేదాంగాలు తెలిసిన వ్యక్తి. సీత విషయంలో  మాత్రం ధర్మం తప్పాడు. అలాంటి రావణాసురుడిని ఓ హాలీవుడ్ విలన్ లా తీర్చిదిద్దాడు. మరోవైపు అతను ఓ పక్షికి మాంసం తినిపించే సీన్ పెట్టడాన్ని కొందరూ తప్పుబడుతున్నారు. మరోవైపు రావణుడికి కోపం వస్తే 10 తలలు వస్తాయి. 10 తలల విషయంలో ఓం రౌత్ సరిగ్గా చూపించలేకపోయాడనే చెప్పాలి. ముఖ్యంగా రావణాసురుడు కొండ చిలువతో మర్దన చేయించుకోవడం ఏంటని పేర్కొంటున్నారు. అసలు ఈ సినిమాకి ఈ సీన్ కి ఏమైనా సంబంధముందా అని ముక్కున వేలు వేసుకుంటున్నారు. 

వీఎఫ్ఎక్స్  :

రావణాసురుడికి కోపం వస్తే పది తలలు కనిపిస్తాయి. కానీ ఆ తలలు కూడా ఈ సినిమాకి ఆయువుపట్టు లాంటివి. కానీ వీఎఫ్ఎక్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ ని సరిగ్గా ఉపయోగించలేకపోయాడు దర్శకుడు. 50 ఏళ్ల కింద తీసిన తెలుగు పౌరాణిక సినిమాలు చూసినా చాాలా బాగుంటాయి. అప్పట్లో అసలు టెక్నాలజీ లేని సమయంలోనే యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు. ఇంత టెక్నాలజీ ఉండి కూడా సరిగ్గా చిత్రీకరించలేకపోయారనే చెప్పాలి. ఒక సన్నివేశంలో చిన్నగా, మరో సన్నివేశంలో పెద్దగా బొమ్మలు కనిపించడం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. సినిమాని ఎక్కువ మంది విమర్శించడానికి ప్రధాన కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు.

డబ్బింగ్  :

సాధారణంగా తమిళ, మలయాళం, కన్నడ సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేస్తుంటారు. కొన్ని సినిమాలు చాలా బాగా సింక్ అవుతాయి. కొన్ని మాత్రం సింక్ కావు. రూ.500 కోట్లు ఖర్చు చేసి తెలుగులో పెద్దస్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తెలుగులో విడుదల చేసినప్పుడు డబ్బింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలికదా.. అస్సలు తీసుకోలేదు. డబ్బింగ్ సినిమాకంటే దరిద్రంగా ఉందనే చెప్పవచ్చు.  తెలుగు భాషకు ఎవరి పాత్ర కూడా అస్సలు సింక్ కాలేదు. పేర్లు కూడా తెలుగువారికి అంతగా నచ్చలేదు. రాముడు, సీత, లక్ష్మణుడు అని భావించిన అభిమానులకు థియేటర్ కి వెళ్లే సరికి రాఘవుడు, జానకి, శేషు పేర్లు వినిపించేసరికి ఆశ్చర్యపోతారు. కొందరికీ లక్ష్మణుడి పేరు శేషు అని ఆదిపురుష్ సినిమా చూసేంత వరకు కూడా తెలియదట. 

యుద్దసన్నివేశాలు :

ఈ సినిమా విరామం వరకు వనవాసం నుంచి సుగ్రీవుడిని కలుసుకునే వరకు చూపించారు. ఇక ఆ తరువాత యుద్ధాన్నే ఎక్కువగా చూపించారు. యుద్ధ సన్నివేశాలు అంతగా లేవు. తొందరగా తీసేయాలి అన్నట్టు తీశారు. కుంభకర్ణుడి పాత్ర యుద్ధంలో ఓ మంచి ఘట్టం. కేవలం రెండు నిమిషాలకే పరిమితం చేశారు. ఇక ఇంద్రజిత్ ని చంపడం అయితే పెద్ద జోక్ అయిపోయింది. ఈ సినిమాకి పనిచేసిన వారు రామాయణం చదవనట్టుంది. అందుకే యుద్ధ సన్నివేశాలు చాలా బోర్ కొడుతుండటం గమనార్హం. హనుమంతుడు లంకలో సృష్టించిన భీభత్సం కూడా మామూలుగానే చూపించారు. హనుమంతుడు అశోక వనాన్ని ధ్వంసం చేస్తాడు. కానీ ఈ మూవీలో హనుమంతుడు సీత ముందే యుద్ధం చేస్తుంటాడు. 

ప్రభాస్ పాత్ర :

ప్రభాస్ పాత్ర రాముడిగా కొన్ని సన్నివేశాల్లో బాగున్నప్పటికీ.. విరామం తరువాత అతని పాత్రను కేవలం గ్రాఫిక్స్ వరకు పరిమితం చేశారు. ప్రభాస్ వేషాదారణ అంతగా బాలేదనే చెప్పాలి. ప్రధానంగా తండ్రి దశరథుడితో మాట్లాడుతున్నప్పుడు రాముడు, సీత, లక్ష్మణుడు నార చీరలు ధరించి అడివికి బయలుదేరుతారు. ఇక్కడ అలా కనిపించలేదు. రాముడి, సీత మధ్య బంధాన్ని కూడా సరిగ్గా చూపించలేదు. జానకిగా కృతి అంతగా మెప్పించలేకపోయింది. రావణాసురుడు విమానంలో సీతని తీసుకెళ్తాడు. కానీ ఓంరౌత్ వింత పక్షిని పెట్టాడు. ఈ సినిమాకి ఎక్కువగా హాలీవుడ్ నిపుణులను పెట్టినట్టున్నాడు. అందుకే ఇతిహాసంలో చూపించినట్టు కాకుండా వింతలోకం నుంచి వింత జీవులు వచ్చినట్టు చూపించారు దర్శకుడు ఓం రౌత్.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Sudigaali Sudheer : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సుడిగాలి సుదీర్.. పెళ్లికూతురు ఎవరంటే ?

 మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి అధికంగా గూగుల్ లో సెర్చ్ చేస్తున్న నెటిజన్స్..! వారు ఇంతకీ దేనికోసం వెతుకుతున్నారో తెలుసా..?

పుష్ప 2 మూవీ నుంచి ఆ కీలక సీన్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్..!

Visitors Are Also Reading