Home » పుష్ప 2 మూవీ నుంచి ఆ కీలక సీన్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్..!

పుష్ప 2 మూవీ నుంచి ఆ కీలక సీన్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్..!

by Anji
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పుష్ప మంచి క్రేజ్ రావడంతో దర్శకుడు సుకుమార్ పుష్ప2 ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప2లో కూడా పుష్పలో నటించిన హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తోంది. పుష్ప 2 చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించబోతున్నారట. ఇటీవలే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఓ గ్లింప్స్ విడుదల చేశారు. ఆ వీడియో కి సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ వచ్చింది. 

Pushpa 2

పుష్ప మూవీలో అల్లుఅర్జున్ డైలాగులు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఏదో ఓ సందర్భంలో ఎక్కడో ఒక చోట పుష్ప డైలాగ్ లను వాడుతూనే ఉన్నారు. ఈ మూవీ కోసం సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియా ఆడియన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గత కొద్ది రోజులుగా పుష్ప2 షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఓ యాక్షన్ సీన్ లీక్ అయినట్టు తెలుస్తోంది. ఇక అందులో ఎర్రచందనం లోడుతో నాలుగు లారీలు నదిలో వెళ్తుండగా.. పోలీసులు వాటిని ఛేంజ్ చేస్తూ వెళ్తున్నారు. అవుట్ డోర్ షూటింగ్ కావడంతో కొంత మంది అభిమానులు ఆ విజువల్స్ ని మొబైల్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Advertisement

ప్రస్తుతం పుష్ప 2 మూవీకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప మూవీలో అనసూయ, సునిల్, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించబోతున్నారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. జగపతి బాబు కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అది వాస్తవమో కాదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

శోభన్ బాబు జయలలిత లవ్ స్టోరీ.. ఆ డైరీలో ఏముందో తెలుసా ?

ఆదిపురుష్ మూవీకి ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా ? 

 పోతినేని రామ్ పెళ్లి చేసుకోబోతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

Visitors Are Also Reading