Home » రాజ‌మౌళి సినిమాను రిజెక్ట్ చేసి ఇప్ప‌టికీ బాధ‌ప‌డుతున్న అర్చ‌న…ఏ సినిమా అంటే..!

రాజ‌మౌళి సినిమాను రిజెక్ట్ చేసి ఇప్ప‌టికీ బాధ‌ప‌డుతున్న అర్చ‌న…ఏ సినిమా అంటే..!

by AJAY
Ad

చిత్ర పరిశ్రమలో కొంతమందికి టాలెంట్ లేకపోయినా అదృష్టం ఉంటే చాలు అవకాశాలు వస్తాయి. కానీ మరికొందరికి అందం టాలెంట్ రెండూ ఉన్నా కూడా అవకాశాలు రాకుండా పోతాయి. అలా హీరోయిన్ల విషయంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అందం అభినయం, టాలెంట్ వారి సొంతం అయినా కూడా అవకాశాలు అందుకొలేని హీరోయిన్ లు కొంతమంది ఉన్నారు. ఆ లిస్టులో తెలుగు అమ్మాయి అర్చన శాస్త్రి కూడా ఉంటుంది. అర్చన మొదట వేద అనే పేరుతో ఇండస్ట్రీకి పరిచయమైంది.

తపన అనే సినిమా ద్వారా మొట్టమొదట హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేదు. కాగా ఆ తర్వాత తనకు నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అన్నపూర్ణమ్మ గారి మనవడు అనే సినిమాలో కూడా అర్చ‌న హీరోయిన్ గా నటించింది.

Advertisement

Advertisement

అయితే అర్చన కు హీరోయిన్ గా కంటే ఇత‌ర పాత్ర‌ల్లోనే ఎక్కువ హిట్స్ ఉన్నాయి. ఇక అలాంటి సమయంలోనే అర్చ‌న‌కు మగధీర సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించే అవకాశం వచ్చింది. రాజమౌళి ఓ కీలక పాత్ర కోసం సంప్రదించగా తాను హీరోయిన్ గానే సెటిల్ అవ్వాలని అర్చ‌న‌ ఆ సినిమాకు నో చెప్పింది. ఈ విషయాన్ని తాజాగా అర్చన ఇంటర్వ్యూలో వెల్లడించింది.

మగధీర సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం తనను సంపాదించార‌ని తెలిపింది. కానీ తాను హీరోయిన్ గానే చేయాలని అనుకున్నట్టు తెలిపింది. మ‌గ‌ధీర సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమాను మిస్ చేసుకున్నందుకు బాధపడ్డాన‌ని చెప్పింది. ఇదిలా ఉంటే అర్చన బిగ్ బాస్ సీజన్ 1 లో కూడా ఎంట్రీ ఇచ్చిన‌ సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. హీరోయిన్ గా సక్సెస్ అందుకోక‌పోయినా నటిగా అర్చన తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది.

ALSO READ : 

రెజీనా కు బంపర్ ఆఫర్ ఇచ్చిన చిరంజీవి.. ఆమె లైఫ్ మారినట్టేనా..!!

ఆ హీరోయిన్ తల్లిగా ప్రేయసిగా, ఫ్రెండ్ గా.. ఆ ఒక్క హీరోతోనే చేసిందట.. ఎవరంటే..!!

Visitors Are Also Reading