Home » ఆ హీరోయిన్ తల్లిగా ప్రేయసిగా, ఫ్రెండ్ గా.. ఆ ఒక్క హీరోతోనే చేసిందట.. ఎవరంటే..!!

ఆ హీరోయిన్ తల్లిగా ప్రేయసిగా, ఫ్రెండ్ గా.. ఆ ఒక్క హీరోతోనే చేసిందట.. ఎవరంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం.. ఇందులో ఎన్నో మార్పులు, చేర్పులతో నటీనటులు తమ నటనను ప్రదర్శిస్తుంటారు. కొంతమంది ఒకే హీరోతో పలుమార్లు పలు పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మైమరపించారు. అలాగే ఈ తరం హీరోయిన్, ఆ హీరోతో ఇప్పటికి మూడు పాత్రల్లో చేసి మెప్పించింది. ఆమె ఎవరు ఏం చేసిందో తెలుసుకుందాం..!! పాత తరం హీరో, హీరోయిన్లలో పాత్రల స్వభావాన్ని బట్టి వారి నటన వరసలు మారేవి. ఒక మూవీలో అన్నా చెల్లి గా చేసిన వారు తర్వాత మూవీ లో హీరో హీరోయిన్ గా చేస్తారు. ఎన్టీఆర్ ఒక సినిమాలో అక్క చెల్లి గా నటించిన సావిత్రి, మరో సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించారు.

 

Advertisement

ఈ విధంగా చేసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ లను వారి ఖాతాలో వేసుకున్నారు. ఈ తంతు ఈ జనరేషన్ లో కూడా నడుస్తోంది. తమన్నా మరియు కాజల్ లాంటివాళ్ళు అటు తండ్రి చిరంజీవితో కొడుకు రామ్ చరణ్ తో కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఒక యంగ్ హీరోయిన్ హీరో నాగచైతన్య తో తల్లిగా, ప్రేయసిగా ఫ్రెండ్ గా నటించింది.. మరి ఆమె ఎవరో చూద్దాం..!!
నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా సంక్రాంతి సమయంలో వచ్చి సూపర్ హిట్ అయింది. అయితే ఆ మూవీకి సీక్వెలుగా బంగార్రాజు మూవీ వచ్చి సూపర్ హిట్ అయింది. ఇందులో చైతన్య జోడీగా నటి కృతి శెట్టి నటించింది.

Advertisement

సోగ్గాడే చిన్ని నాయన సినిమా లో డబల్ యాక్షన్ లో ఒక నాగార్జునకు జోడిగా లావణ్య త్రిపాటి, మరో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించారు. బంగార్రాజు లో నాగచైతన్య మనవడిగా నటించాడు. అయితే రాము,సీతా కొడుకు ఈ చిన్న బంగార్రాజు, ఈ లెక్కన చూసుకుంటే లావణ్య నాగచైతన్య కు తల్లిగా అవుతుంది. రమ్యకృష్ణ ఏమో నానమ్మ అవుతుంది. అంతకు ముందు గా నాగచైతన్య లావణ్య కలిసి యుద్ధం శరణం మూవీలో హీరో హీరోయిన్లుగా నటించారు. దానికంటే ముందు మనం సినిమాలో ఫ్రెండ్స్ గా కనిపించారు. ఈ విధంగా ఈ తరం హీరోల్లో ఒకరి గా ఉన్నటువంటి చైతుకు.. ఈ జనరేషన్ హీరోయిన్ లావణ్య త్రిపాటి, ఓవైపు తల్లిగా మరోవైపు ఫ్రెండ్ గా ఇంకోవైపు ప్రేయసిగా మూడు పాత్రల్లో చేసి మెప్పించింది.

ALSO READ :

Jabardasth : సుధీర్ చేసిన ప‌నికి ఫీల్ అయిన ర‌ష్మీ.. రోజా వార్నింగ్‌..!

ఎన్టీఆర్ కి RRR లో నిజంగానే అన్యాయం జరిగిందిగా ! మరి ఇదేంటి జక్కన్నా ?

 

 

Visitors Are Also Reading