Home » రెజీనా కు బంపర్ ఆఫర్ ఇచ్చిన చిరంజీవి.. ఆమె లైఫ్ మారినట్టేనా..!!

రెజీనా కు బంపర్ ఆఫర్ ఇచ్చిన చిరంజీవి.. ఆమె లైఫ్ మారినట్టేనా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు టాలీవుడ్ లో యంగ్ హీరోలందరితో సినిమాలు చేసి మంచి హిట్స్ అందుకున్న బ్యూటీ రెజీనా. సుధీర్ బాబు హీరోగా శివ మనసులో శృతి అనే మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పిల్లా నువ్వు లేని జీవితం, రొటీన్ లవ్ స్టోరీ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కొత్తజంట లాంటి సినిమాలు చేసి వరుస హిట్ లను అందుకుంది. అలా తన పర్ఫార్మెన్స్ తో యంగ్ హీరోలందరితో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ అనూహ్యంగా రెజీనా గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఆమె చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ రావడంతో అమ్మడు ఆఫర్లు తగ్గిపోయాయి. నక్షత్రం లాంటి సినిమాల్లో ఓవర్ డోస్ గ్లామర్ చూపించినా ఫలితం లభించలేదు. తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళంలో మాత్రం సాలీడు ప్రాజెక్టులు చేస్తూ వచ్చింది. కరోనా సమయంలో గత రెండు సంవత్సరాల నుంచి రెజీనా నటించిన సినిమాలు హిట్స్ కాలేకపోయాయి. తమిళ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో పాటుగా తెలుగులో అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ లో చిరంజీవితో కలిసి ఒక ఐటమ్ సాంగ్ చేసే అవకాశాన్ని దక్కించుకుందట.

Advertisement

Advertisement

ఇప్పటికే ఆ మూవీలోని సాంగ్ లిరికల్ వీడియో రిలీజై అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే మెగాస్టార్ సరసన ఐటమ్ సాంగ్ తో మెరవబోతున్న ఈ అమ్మడుకు ఇక అవకాశాలు వస్తాయని అంటున్నారు. అయితే ఈ విషయంలో అభిమానులు కూడా ఇదే మాట్లాడుకుంన్నారు. ఆచార్య మూవీ తర్వాత రెజీనా కు వరుస అవకాశాలు వస్తాయని కచ్చితంగా చెబుతున్నారు. మరి చూడాలి మెగాస్టార్ రెజినాకు ఎలాంటి అవకాశం తీసుకువస్తారో.

ALSO READ :

ఎన్టీఆర్ కి RRR లో నిజంగానే అన్యాయం జరిగిందిగా ! మరి ఇదేంటి జక్కన్నా ?

యాంక‌ర్ శ్రీముఖి సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌డం వెన‌క ఇంత క‌థ జ‌రిగిందా…!

 

 

Visitors Are Also Reading