Home » April 7th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

April 7th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

హైకోర్ట్ సిజే ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు,కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, హీరోలు గోపిచంద్, అల్లరి నరేష్ లు నేడు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.

Advertisement

బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిజేపి లో చేరే అవకాశాలు ఉన్నాయి. సమన్వయ కర్తగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

తిరుమలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు జూన్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలతో సహా ప్రత్యేక దర్శనాలను కుదిస్తున్నట్టు టీటీడీ ప్ర‌క‌టించింది. ఫేస్ రికగ్నిషన్ విధానం వల్ల సామాన్య భక్తులుకు వసతి గదులు కేటాయింపు సులభంగా మారిందని స్ప‌ష్టం చేసింది.

గోల్డ్ కాయిన్స్ పేరుతో మేడిపల్లిలో రూ.10 కోట్లు వసూలు చేసి కేటుగాళ్లు ప‌రార‌య్యారు. జన జాగరణ సమితి ట్రస్ట్ పేరుతో లక్షకడితే రెండున్నర లక్షలు ఇస్తామని..గోల్డ్ కాయిన్స్ ఇస్తామని మోసం చేశారు

Advertisement

కరీంనగర్ జైలు నుంచి బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజయ్ బెయిల్ పై విడుదల‌య్యారు. నిన్న రాత్రి షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. సంజయ్ విడుదల నేపథ్యంలో బీజేపీ శ్రేణులు జైలు వద్ద సంబరాలు జ‌రుపుకున్నారు.

మెరైన్ కమాండో చందక గోవింద్ పార్థివ దేహం స్వ‌గ్రామానికి త‌ర‌లించారు. ప్రమాదంలో అసువులు బాసిన మెరైన్ కమాండో చందక గోవింద్….భారీ ర్యాలీతో స్వగ్రామానికి ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తున్నారు.

హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో ఏసీ బస్సులో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నడుస్తున్న బస్సులో నుంచి ఒకసారిగా పొగలు వ‌చ్చాయి. దాంతో వెంటనే బస్సుని పక్కన నిలిపి ప్ర‌యాణీకుల‌ను కింద‌కి దించారు.

హైదరాబాద్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ బాటిల్స్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగ‌సిప‌డ్డాయి. తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు..స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకుని కొన్ని గంటలు శ్రమించి మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకువ‌చ్చారు.

విజయనగరం జిల్లాలో మరోసారి పులి పంజా విసిరింది.శృంగవరపుకోట పరిసర ప్రాంతంలో పులి సంచారం చేస్తున్న‌ట్టు అధికారులు గుర్తించారు. ముసిడిపల్లిలో ఆవును హతమార్చడంతో ప‌రిస‌ర గ్రామాల ప్ర‌జ‌లు ఆందోళన చెందుతున్నారు.

Visitors Are Also Reading