Home » April 5th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

April 5th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు అయ్యారు. ప‌ద‌వ‌త‌ర‌గతి పేప‌ర్ లీక్ కేసులో సంజ‌య్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో బీజేపీ నాయ‌కులు ఆందోళ‌న చేప‌డుతున్నారు.

Advertisement

నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం జ‌ర‌గ‌నుంది. పద్మ అవార్డులను రాష్ట్ర‌ప‌తి ప్రదానం చేయనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో చినజీయర్ స్వామి, కీరవాణి అవార్డుల‌ను అందుకోనున్నారు.

క‌డ‌ప ఒంటిమిట్టలో రాత్రికి పండు వెన్నెల్లో కోదండ‌రాముని కల్యాణోత్సవం జ‌ర‌గ‌నుంది. ఉత్స‌వానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. స‌ర్వాంగ సుంద‌రంగా కల్యాణవేదిక ముస్తాబ‌య్యింది. ఒంటిమిట్టలో కల్యాణం నేప‌థ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Advertisement

బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాలలో నిరసన ప్రదర్శనలకు బీజేపీ పిలుపునిచ్చింది.

కరీంనగర్‌లో అర్ధరాత్రి హైడ్రామా నెల‌కొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసి యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పీఎస్‌కు పోలీసులు త‌ర‌లించారు.

హైద‌ర‌బాద్ లో గ‌త రాత్రి కాల్పుల క‌ల‌క‌లం చోటు చేసుకుంది. ఓ హోట‌ల్ లో ఆకాష్ సింగ్ అనే వ్య‌క్తి పై పాయింట్ బ్లాక్ లో కాల్పులు జ‌రిపారు. దాంతో యువ‌కుడు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు.

హైద‌రాబాద్ లో ఎండ‌లు మండిపోతున్నాయి. హైద‌ర‌బాద్ బోర‌బండ‌లో 40.2 ఢిగ్రీల ఊష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి.

క‌ర్నాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీలో చేరిక‌లు ఊపందుకున్నాయి. క‌న్న‌డ స్టార్ కిచ్చా సుదీప్ బీజేపీలో చేర‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ నెల 30 వ తేదీన తెలంగాణ నూత‌న స‌చివాల‌యం ప్రారంభం కానుంది. ఈ స‌చివాల‌యం ప్రారంభోత్స‌వానికి 2,500 మందికి ఆహ్వానం అందింది.

Visitors Are Also Reading