Home » AP Govt Jobs 2023 : ఏపీలో 5,388 వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీ… పూర్తి వివరాలు ఇవే..!

AP Govt Jobs 2023 : ఏపీలో 5,388 వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీ… పూర్తి వివరాలు ఇవే..!

by Bunty
Ad

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ పాఠశాలల్లోని నైట్ వాచ్ మెన్ ఉద్యోగాలకు సంబంధించి నియామకాలకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 5,388 పోస్టులు ఉన్నట్లు, వీటిని భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు గౌరవ వేతనంగా రూ. 6000 అందించనున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలోనే జారీకానుంది.

READ ALSO :  ‘NBK 108’ నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ అదిరిపోయింది!

Advertisement

అయితే ఈ పోస్టులకు ఇప్పటికే పాఠశాలల్లో నాడు,నేడు కార్యక్రమం కింద ఆయాలుగా పనిచేస్తున్న మహిళల భర్తలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. గ్రామం లేదా వార్డుల్లో మాజీ సేవా పురుషులకు అనగా ఎక్స్ సర్వీస్ మెన్లకు రెండవ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రెండు విభాగాలకు సంబంధించినవారు లేని పక్షంలో పేరెంట్స్ కమిటీ సూచనల మేరకు అర్హత గల వ్యక్తిని నియమించుకునే అవకాశం కల్పించింది. అదే విధంగా స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ మిడ్ డే మీల్స్ డైరెక్టర్ ఈ విషయంలో తదుపరి అవసరమైన చర్యలను తీసుకుంటారు.

Advertisement

READ ALSO : హీరోయిన్ ఛార్మికి అలాంటి మెసేజ్ లు చేసి..టార్చర్ పెట్టాడా ?

ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు చేస్తోంది. అందువల్ల ఖరీదైన ఫర్నిచర్ ను రక్షించాల్సిన అవసరం ఉంది. కావున ఈ వస్తువులు అన్నింటిని రక్షించడంతో పాటు సంఘ వ్యతిరేక శక్తులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రభుత్వం నైట్ వాచ్ మెన్ పోస్టుల నియామ కానికి నిశ్చయించింది.

READ ALSO : రవితేజకు భార్య, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…?

Visitors Are Also Reading