Home » ‘NBK 108’ నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ అదిరిపోయింది!

‘NBK 108’ నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ అదిరిపోయింది!

by Bunty
Ad

నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం బాలయ్య బాబు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇదే జోష్ లో NBK 108 సినిమా కూడా మొదలుపెట్టారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో NBK 108 సినిమాని తెరక్కెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

READ ALSO : భర్తతో గొడవలు… నిహారిక కోసం రంగంలోకి దిగిన చిరంజీవి?

Advertisement

కామెడీ సినిమాలు తీసే అనిల్ రావిపూడి ఈసారి కామెడీ కాదంటూ బాలయ్యతో సినిమా తీస్తుండటం, బాలకృష్ణ వరుస విజయాలతో జోరులో ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఉగాది కానుకగా అప్డేట్ ఇస్తామని చిత్ర యూనిట్ మంగళవారం నాడు ప్రకటించారు. తాజాగా నేడు ఉగాది సందర్భంగా NBK 108 సినిమా నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Advertisement

READ ALSO : హీరోయిన్ ఛార్మికి అలాంటి మెసేజ్ లు చేసి..టార్చర్ పెట్టాడా ?

Nandamuri Balakrishna's powerful first look from Kajal Aggarwal's #NBK108 OUT on Ugadi | Regional-cinema News – India TV

ఫస్ట్ లో పోస్టర్ పై This time beyond your imagination అని పోస్ట్ చేసి ఈసారి మీ ఊహలకు మించే సినిమా ఉండబోతుందని హింట్ ఇచ్చారు. ఈ పోస్టర్ లో బాలయ్య గంభీరంగా నిల్చోని మెలేసిన మీసంతో మేడలో కండువా చుట్టుకుని ఉన్నారు. మరో పోస్టర్లో బాలయ్య పవర్ఫుల్ గా చూస్తున్నట్టు ఉంది. దీంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక బాలయ్య ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు.

READ ALSO : రవితేజకు భార్య, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…?

Visitors Are Also Reading