Home » మిస్సింగ్ యూ అంటూ విరాట్ కోహ్లీపై అనుష్క ఎమోష‌న‌ల్ పోస్ట్..!

మిస్సింగ్ యూ అంటూ విరాట్ కోహ్లీపై అనుష్క ఎమోష‌న‌ల్ పోస్ట్..!

by Anji
Ad

టీ-20 ప్ర‌పంచ క‌ప్‌కి స‌న్న‌ద్ధం కావ‌డానికి టీమ్ ఇండియా సెప్టెంబ‌ర్ 20 నుంచి ఆస్ట్రేలియాతో 3 టీ-20 సిరీస్‌లో ఆడ‌నుంది. తొలి మ్యాచ్ సెప్టెంబ‌ర్ 20న పంజాబ్‌లోని మొహ‌లీలో జ‌రుగ‌నుంది. ఇందుకోసం ఇరు జ‌ట్లు అక్క‌డికీ చేరుకుని ఆస్ట్రేలియా ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ కూడా మొహ‌లీ చేరుకున్నాడు. ఈ సంద‌ర్భంగా కోహ్లీపై అనుష్క ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది. అనుష్క త‌న పోస్ట్‌లో ఇలా రాసింది. ఉత్తేజ‌క‌ర‌మైన అంద‌మైన ప్ర‌దేశాల్లో ప్ర‌పంచం మెరుగ్గా క‌నిపిస్తుంది. హోట‌ల్ బ‌యో బ‌బుల్‌లో ఈ వ్య‌క్తితో ఎందుకు ఉండ‌కూడ‌దు. హబ్బీ మిస్సింగ్ యు’ అని హ్యాస్‌ట్యాగ్ రాసికొచ్చింది.

Advertisement

ఇటీవ‌లే జ‌రిగిన ఆసియా క‌ప్ 2022లో విరాట్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసాడు. మ‌ళ్లీ పాత ఫామ్‌లోకి వ‌చ్చారు. ఆసియా క‌ప్‌లో కోహ్లీ ఐదు మ్యాచ్‌ల్లో 148 స్ట్రైక్ రేట్‌తో 276 ప‌రుగులు చేసాడు. ఆసియా క‌ప్‌లో ఆప్ఘ‌నిస్తాన్‌తో జ‌రిగిన చివ‌రి మ్యాచ్‌లో కోహ్లీ సెంచ‌రీ సాధించాడు. 1020 రోజుల త‌రువాత అత‌ని బ్యాట్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో సెంచ‌రీ సాధించింది. అత‌ను గ‌తంలో న‌వంబ‌ర్ 2019లో బంగ్లాదేశ్‌తో కోల్‌క‌తా టెస్ట్‌లో సెంచ‌రీ చేశాడు విరాట్‌. 71వ అంత‌ర్జాతీయ సెంచ‌రీ త‌రువాత అనుష్క భావోద్వేగ పోస్ట్‌ను కూడా షేర్ చేసింది. మ‌రోవైపు కోహ్లీ త‌న సెంచ‌రీని భార్య అనుష్క‌, కూతురు అనుష్క‌ల‌కు అంకితం చేశాడు.

Advertisement

Also Read :  ఎక్కువ సేపు కూర్చుని ప‌ని చేస్తే ప్రాణానికే ప్ర‌మాదం.. జాగ్ర‌త్త‌..!


ఇదిలా ఉండ‌గా.. అనుష్క ఐదేళ్ల త‌రువాత మ‌ళ్లీ సినిమారంగంలోకి వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. క్రికెట‌ర్ ఝ‌ల‌న్ గోస్వామి జీవితం ఆధారంగా తెర‌కెక్కించిన చ‌క్దా ఎక్స్ ప్రెస్‌లో ఆయ‌న న‌టించ‌నున్నారు. ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించాల్సి ఉంది. ఆసియా క‌ప్ త‌రువాత విరాట్ కోహ్లీ త‌న కుటుంబంతో చాలా స‌మ‌యం గ‌డిపాడు. రోడ్డు ప‌క్క‌న ఉన్న కేఫ్‌లో అనుష్క‌తో విరాట్ రొమాంటిక్ కాపీ డేట్‌ని ఆస్వాధించాడు. ఆఫోటోలు వైర‌ల్ అయ్యాయి. విరాట్ కోహ్లీ ఖాళీ స‌మ‌యాన్ని ఎక్కువగా కుటుంబ స‌భ్యుల‌తో గ‌డుపుతాడు. విరాట్‌, అనుష్క వ్య‌క్తి గ‌త జీవితాల గురించి మాట్లాడ‌రు. కానీ వారు సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని చిత్రాలు అలా చెబుతున్నాయి.

Also Read :  నా రెండో పెళ్లి గురించి మీకెందుకు…వాళ్ల‌కు సింగ‌ర్ సునిత స్ట్రాంగ్ కౌంట‌ర్..!

Visitors Are Also Reading