మన పూర్వికుల కాలంలో ప్రపంచంలోని చాలా మంది ఎక్కువగా వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తూ ఉండేవారు. ఆ కాలంలో జీవిస్తూ ఉండే వారికి ఎక్కువగా శారీరక శ్రమ ఉండేది. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి వ్యవసాయ పనులు చేస్తూ ఉండాల్సి వచ్చేది. ప్రస్తుత కాలంలో ఉన్న కొంత మంది యువతకు అసలు వ్యవసాయం అంటే ఏంటో తెలియదు.
ఎందుకంటే ఇప్పటి కొన్ని ఉద్యోగాలు మనిషి శరీరానికి శ్రమ లేకుండా చేస్తున్నాయి. చాలా ఉద్యోగాల్లో ఆ ఉద్యోగులు ఎక్కవ సేపు కూర్చొన పని చేయాల్సి వస్తుంది. అలా చాలా సేపు కూర్చుని పని చేయడం వలల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటిగా బరువు పెరగడం, చెడు కోలెస్ట్రాల్ స్థాయి పెరిగి జీర్ణ వ్యవస్థ పని తీరు తగ్గిపోతుంది. ఎక్కువగా కూర్చున్న చోటు నుంచి కదలకుండా చేసే ఉద్యోగులకు గుండెసంబంధిత వ్యాధులు, క్యాన్సర్ లాంటి భయంకరమన వ్యాదులతో మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలా అధ్యయనాలు వెల్లడించాయి.
Ad
Also Read : భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగవచ్చా..? నీళ్లను ఎప్పుడు తాగాలంటే..?
ప్రపంచ వ్యాప్తంగా ఇలా ఎక్కువ సేపు కదలకుండా కూర్చొని పని చేసే వారి మరణాలు దాదాపు 60 శాతంగా ఉన్నాయి. ప్రతీ రోజు 8 గంటల కంటే ఎక్కువగా కదలకుండా కూర్చొని పని చేసేవారు ఊబకాయంతో మరణించే ప్రమాదం ఉందని చాలా పరిశోధనలు తెలిపాయి. తక్కువ సమయం కూర్చొని పని చేసే వారిలో మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్టు కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఎక్కువ సేపు కూర్చొని పని చేసే ఉద్యోగులు మధ్య మధ్యలో కొద్ది సేపు లేచి నిలబడి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు విరామం తీసుకోవాలి. అంతేకాదు.. వీరు ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. ఇలా చేస్తే వారి ఉద్యోగంతో పాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read : బ్లాక్ టీ యొక్క ప్రయోజనాలు తెలిస్తే మీరు అస్సలు వదలరు..!