Home » బాలీవుడ్ స్టార్లను అమ్మేస్తున్నారు..!

బాలీవుడ్ స్టార్లను అమ్మేస్తున్నారు..!

by Azhar
Ad
ఈ మధ్య బాలీవుడ్ అనేది పూర్తిగా పడిపోతుంది అనే విషయం తెలిసిందే. ఇక మన సౌత్ నుండి వెళ్లిన సినిమాలు ఎక్కువగా అక్కడ హిందీలో హిట్ అవుతున్నాయి. కానీ బాలీవుడ్ హీరోలు చేస్తున్న సినిమాలు ఎక్కువగా ప్లాప్ అవుతున్నాయి. ఇక ఈ విషయంపై బాలీవుడ్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. బాలీవుడ్ కి స్టార్లను అమ్మేస్తున్నారు అని ఆయన చెప్పారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. సౌత్ సినిమాలు సక్సెస్ కావడానికి కారణం వారు కథను నమ్ముకొని సినిమా తీస్తారు. కానీ ఇక్కడ బాలీవుడ్ లో మాత్రం హీరోను నమ్ముకొని సినిమా తీసి… అతని క్రేజ్ ను అతడిని అమ్ముకోవాలను చూస్తున్నారు. అందుకే ఇక్కడ బాలీవుడ్ లో సినిమాలు అనే ప్లాప్ అవుతున్నాయి. అయితే ఒక్క వస్తులువు తయారు చేసే కంపెనీ.. ఎప్పుడైతే వినియోగదారులను పట్టించుకోదో అప్పుడు అది పడిపోతుంది.
ఇదే తరహాలో అభిమానుల ఇష్టాలను పట్టించుకోకపోవడం వల్లే బాలీవుడ్ సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. కానీ సౌత్ సినిమాలు ఆలా ఉండవు. అందుకే హిట్ అవుతున్నాయి అని పేర్కొన్నారు. అయితే అనుపమ్ ఖేర్ ఇప్పుడు బాలీవుడ్ లో మొత్తం సునామి సృష్టిస్తున్న కార్తికేయ 2 సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో హీరోగా మన టాలీవుడ్ కు చెందిన నిఖిల్ నటించగా.. హీరోయిన్ గా అనుపమ నటించింది. శ్రీకృష్ణుని మీద వచ్చిన ఈ సినిమా అనేది ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్స్ ను దాటేసింది.

Advertisement

Visitors Are Also Reading