Home » పాక్ అభిమానుల కల నెరవేర్చిన విరాట్..!

పాక్ అభిమానుల కల నెరవేర్చిన విరాట్..!

by Azhar
Ad

విరాట్ కోహ్లీ గురించి ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లీ భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. అలాగే 8 ఏళ్ళు జట్టుకు కెప్టెన్ గా కూడా సేవలు అందించాడు. అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వల్ల ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రపంచం నలుమూలలతో పాటుగా పాకిస్థాన్ లో కూడా కోహ్లీకి అభిమానులు ఉన్నారు. ఇది అందరికి తెలిసిందే.

Advertisement

అయితే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరిగే సమయంలో తప్పకుండ ఆ పాకిస్థాన్ ఫ్యాన్స్ కోహ్లీకి తమ మద్దతు అనేది తెలుపుతారు. అయితే ఇప్పుడు కూడా యూఏఈలో భారత్, పాక్ తలపడనుండటంతో పాకిస్థాన్ కు చెందిన కోహ్లీ ఫ్యాన్స్ అక్కడికి వెళ్లారు. ఇక కోహ్లీని కలవాలి అనే ఇద్దరు పాక్ ఫ్యాన్స్ యొక్క కలను కోహ్లీ నెరవేర్చాడు. అందులో ఒక్క యువకుడు సెక్యూరిటీని ధాటి కోహ్లీని కలిసే ప్రయత్నం చేసాడు.

Advertisement

కానీ సెక్యూరిటీ అతడిని అడ్డుకొని పక్కకు తీసుకెళ్తుండగా.. నేను కోహ్లీ అభిమానిని.. అతడిని కలవడానికి పాకిస్థాన్ నుండి వచ్చాను అంటూ అరవడం ప్రారంభించాడు. దాంతో కోహ్లీ సెక్యూరిటీని ఆపి అతడిని కలిసాడు. ఇక ఓ హ్యాండీక్యాప్డ్ యువతీ కూడా కోహ్లీ కలవాలని కలగా పెట్టుకొని యూఏఈకి వెళ్ళింది. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత కోహ్లీనే ఆమె దగ్గరకు వెళ్లి ఫోటో అనేది దిగాడు. దీంతి వారిద్దరూ కూడా ఈ జామాకు మాకు ఇది చాలు.. మా కల అనేది తీరింది అని కామెంట్స్ చేసారు.

ఇవి కూడా చదవండి :

గాయంతో ఆసియా కప్ కు రోహిత్ దూరం కానున్నాడా..?

బ్రేకప్ సందేశం ఇచ్చేసిన గిల్, సారా..!

Visitors Are Also Reading