Home » మరో మెగా హీరోకు 100 కోట్ల క్లబ్ లో చోటు..ఎవరంటే..?

మరో మెగా హీరోకు 100 కోట్ల క్లబ్ లో చోటు..ఎవరంటే..?

Ad

ప్రస్తుతం ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ దూసుకుపోతోంది. ఈ ఫ్యామిలీ హీరోల నుంచి ఏ సినిమా వచ్చినా రికార్డు క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు 100 కోట్ల క్లబ్ లో చేరారు. ఇప్పుడు దానికి చేరువలో ఈ యంగ్ హీరో కూడా ఉన్నాడు.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. మెగా హీరో సాయి ధరంతేజ్ హీరోగా నటించిన మూవీ విరూపాక్ష.. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యి రికార్డులు క్రియేట్ చేస్తోంది.

also read:టైగర్ 3లో సల్మాన్, షారుక్ ఫైట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా ?

Advertisement

దర్శకుడు కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ ఎటువంటి బజ్ లేకుండా, అభిమానుల ముందుకు వచ్చి బంపర్ హిట్ గా నిలిచింది. డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు గతంలో చేసింది కూడా ఒక సినిమానే. ఆ సినిమా కూడా ఆడలేదు. ఇక సాయిధరమ్ తేజ్ వరుస ప్లాఫ్ లతో ఉన్నాడు. పెద్ద బ్యానర్ తెలుగు స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్ స్క్రీన్ ప్లే చేశారనేది ఈ సినిమాపై కొంతవరకు బజ్ పెంచింది. దీనితో ఒక మోస్తారు అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

Advertisement

also read:Title: బాలయ్య బోయపాటి సినిమా స్టోరీ లీక్… నేట్టింట వైరల్..!

ప్రపంచవ్యాప్తంగా విరూపాక్ష తొలిరోజే 12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఈ చిత్రం నాలుగు రోజుల్లో 50 కోట్ల వసూళ్ళను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక 13 రోజుల్లో 82 కోట్ల వరకు వసూలు చేసింది. ప్రస్తుతం 91 కోట్ల గ్రాస్ ను క్రాస్ చేసిందట. త్వరలోనే ఈ మూవీ 100 కోట్ల మార్కు క్రాస్ చేయబోతుందని తెలుస్తోంది. క్షుద్ర పూజల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ గా మంచి ఆదరణ పొందడంతో పాటుగా ఈ సినిమాకి పోటీగా నిలిచే మరో పెద్ద సినిమా లేకపోవడం విరూపాక్ష కలెక్షన్స్ పై ప్రభావం చూపింది. ఏది ఏమైనా మరో మెగా హీరో అతి త్వరలో 100 కోట్ల క్లబ్ లో చేరబోతున్నాడు.

also read:బాలకృష్ణ కంటే పెద్ద స్టార్ అవ్వాల్సిన..ఈ నందమూరి హీరోను వెన్నుపోటు పొడిచింది ఎవరంటే..?

Visitors Are Also Reading