Home » Title: బాలయ్య బోయపాటి సినిమా స్టోరీ లీక్… నేట్టింట వైరల్..!

Title: బాలయ్య బోయపాటి సినిమా స్టోరీ లీక్… నేట్టింట వైరల్..!

by AJAY
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి టాలెంట్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు చిత్ర బృందం ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ బాలయ్య కెరియర్లో 108వ మూవీగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఎన్బికె 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ పూర్తి చేస్తూ వస్తుంది.

Advertisement

ఈ సినిమాను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ తర్వాత బాలయ్య చేయబోయే మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ఇలా ఉంటే బాలయ్య తన తదుపరి మూవీని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే వీరి కాంబినేషన్లో సింహ… లెజెండ్… అఖండ మూవీలు రూపొందాయి.

Advertisement

ఈ మూడు మూవీలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. వీరి కాంబినేషన్లో మరో మూవీ రాబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా జూన్ 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. తాజాగా బాలయ్య… బోయపాటి కాంబినేషన్లో రాబోతున్న మూవీకి సంబంధించిన స్టోరీ ఇదే అంటూ ఒక కథ వైరల్ అవుతుంది.

అసలు విషయంలోకి వెళితే… బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిపోయే సినిమాలో బాలయ్య పొలిటికల్ లీడర్ పాత్రలో కనిపించబోతున్నట్లు… ఇందులో ఎన్నో పొలిటికల్ అంశాలకు సంబంధించిన డైలాగులు ఉండబోతున్నట్లు… దానితో ఈ మూవీని వచ్చే సంవత్సరం ఎలక్షన్లకు ముందుగా విడుదల చేసే విధంగా మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

Visitors Are Also Reading