Home » రెండు రోజుల్లో బిగ్ బాస్ షో ప్రసారం.. లాస్ట్ మినిట్ లో షాక్ ఇచ్చిన అంజలి పవన్..!

రెండు రోజుల్లో బిగ్ బాస్ షో ప్రసారం.. లాస్ట్ మినిట్ లో షాక్ ఇచ్చిన అంజలి పవన్..!

by Srilakshmi Bharathi
Ad

ఎన్ని మీమ్స్ వచ్చినా, ఎంత ట్రోలింగ్ జరుగుతున్నా.. బిగ్ బాస్ సీజన్ చూసే వాళ్ళకి కొదవ లేదు. చాలా మంది బిగ్ బాస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రియాలిటీ షో ఎన్ని సీజన్స్ వచ్చినా ఆడియన్స్ లో జోష్ తగ్గదు. అయితే.. ప్రతి సారీ ఈ సీజన్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అన్న విషయం ఆసక్తికరంగా మారుతూ ఉంటుంది. తాజాగా.. బిగ్‏బాస్ సీజన్ 7 రాబోతోంది. ఎప్పటిలానే, నాగార్జున ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

anjali pawan

Advertisement

అయితే.. సీజన్ 6 లో జరిగిన తప్పులు జరగకుండా చూసుకుని డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే సిద్ధం అయినట్లు తెలుస్తోంది.కాగా.. కంటెస్టెంట్స్ అందరు ప్రేక్షకులకు తెలిసినవారే. ప్రముఖ సీరియల్ నటి, యూట్యూబర్ అంజలి పవన్ కూడా ఈ సారి బిగ్ బాస్ సీజన్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంది. అయితే.. మరికొద్ది గంటలలో షూటింగ్ ప్రారంభం కానుంది అనగా.. ఆమె బిగ్ బాస్ టీం కు షాక్ ఇచ్చారు. ఆమె బిగ్ బాస్ సీజన్ 7 నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

Advertisement

ఆమె బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో బిగ్ బాస్ టీం కూడా షాక్ అయ్యారు. మొగలిరేకులు సీరియల్ తో బాగా పాపులర్ అయిన అంజలి ఉన్నట్లుండి బిగ్ బాస్ షో నుంచి ఎందుకు తప్పుకోవడం బిగ్ బాస్ కి షాక్ కలిగించే విషయమే. అయితే.. అనుకోని కారణాల వలన ఆమె బిగ్ బాస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం బిగ్ బాస్ టీం ఆమెకు ప్రత్యామ్నాయం వెతుక్కునే పనిలో ఉన్నారు. పవన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆమె అంజలి పవన్ గా మారారు. ఆమెకు ఇంస్టాగ్రామ్ చాలా ఫాలోయింగ్ ఉంది. ఓ యు ట్యూబ్ ఛానెల్ కూడా రన్ చేస్తున్న అంజలి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి ఉంటె మరింత పాపులర్ అయ్యేవారు. కానీ అనుకోని కారణాల వలన ఆమె తప్పుకోవాల్సి వచ్చింది.

మరిన్ని..

జూనియర్ ఎన్టీఆర్ అలా తింటూ ఉంటారా? మహేష్ బాబు ఏమని ఏడిపించేవారంటే?

సెప్టెంబర్ 18 లేదా 19…? వినాయకచవితి ఏ రోజు చేసుకోవాలి…?

Samantha : సమంతను దారుణంగా మోసం చేశారు..పాపం కోట్ల నష్టం ?

Visitors Are Also Reading