Home » సంజూ శాంసన్ కు ఎందుకు అన్యాయం జరుగుతుంది..?

సంజూ శాంసన్ కు ఎందుకు అన్యాయం జరుగుతుంది..?

by Azhar
Ad

సంజూ శాంసన్.. ఈ పేరు అనేది ఇప్పుడు పెద్ద ట్రేండింగ్ గా మారింది. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ కేరళ క్రికెటర్ 2015 లో భారత జట్టు తరపున అరంగేట్రం చేసాడు. కానీ ఇప్పటివరకు అతను ఆడినవి మాత్రం కేవలం 14 మ్యాచ్ లు మాత్రమే. అందుకే సంజూ విషయంలో బీసీసీఐ ఎప్పుడు ట్రోలింగ్ కు గురవుతుంది. నిన్న మొన్న వచ్చినవారు ఎక్కువ మ్యాచ్ లు ఆడుతుంటే… సంజూకి మాత్రం అవకాశాలు రావడం లేదు. ఐపీఎల్ లో రాణించిన అందరిని టీం ఇండియాలోకి తీసుకునే బీసీసీఐ సెలక్టర్లు.. సంజూని మాత్రం పట్టించుకోవడం లేదు.

Advertisement

గత రెండు ఐపీఎల్ లో సీజన్ లలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా 400 పెరిగా పరుగులు చేసాడు. అలాగే ఈ ఐపీఎల్ 2022 లో తన జట్టును ఫునల్స్ కు చేర్చాడు. అయిన కూడా ఈ ఐపీఎల్ తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 లో ఎంపిక చేయలేదు. ఐపీఎల్ ఆటగాళ్లనే ఎక్కువగా ఎంపిక చేసిన బీసీసీఐ.. సంజూకి అవకాశం ఇవ్వలేదు. ధనతో ఫ్యాన్స్ ట్రోలింగ్ చేసారు. దాంతో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన రెండో భారత జట్టులో సంజూకి అవకాశం వచ్చింది. అందువల్ల ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు.

Advertisement

కానీ ఐర్లాండ్ తో నిన్న జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో సంజూ తుది జట్టులో లేడు. అందువల్ల సంజూ రెండో భారత జట్టుకు కూడా పనికిరాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు సంజూ సౌత్ ఇండియాకు చెందిన వాడు కాబట్టే.. అసలు అవక్షను ఇవ్వడం లేదు అని.. పంత్ లాంటి ఆటగాళ్లు ఎన్నిసార్లు విఫలమైన అవకాశాలు ఇస్తున్నారు అని బీసీసీఐపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ గాయ పడటంతో రెండో మ్యాచ్ లో సంజూకి అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నారు అభిమానులు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

ఇవి కూడా చదవండి :

ఇండియా పాకిస్థాన్ దరిదాపుల్లో కూడా లేదు..!

కోహ్లీకి మంచి రోజులు వచ్చాయి…!

Visitors Are Also Reading