Home » కోహ్లీకి మంచి రోజులు వచ్చాయి…!

కోహ్లీకి మంచి రోజులు వచ్చాయి…!

by Azhar
Ad

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దాదాపుగా మూడు ఏళ్ళ నుండి సెంచరీ చేయలేదు అనే విష్యం అందరికి తెలిసిందే. అయితే ఇది మాములు ఆటగాళ్లకు పెద్ద విషయం కాదు.. కానీ విరాట్ కోహ్లీకి విషయంలో చాలా పెద్దది. అయితే కోహ్లీ కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకోలేక పరుగులు చేయలేకపోతున్నాడు అని చాలా మంది అన్నారు. ఇక అదే కారణం చూపిస్తూ.. విరాట్ కెప్టెన్సీ నుండి కూడా తప్పుకున్నాడు. దాంతో మళ్ళీ బ్యాటింగ్ లో పాత విరాట్ ను చూడవచ్చు అని చాలా మంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇక ఫామ్ లోకి రావడనికి కోహ్లీకి విశ్రాంతి అని చెప్పారు.

Advertisement

ఆ కారణంగానే ఈ ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 లో పాల్గొనకుండా రెస్ట్ తీసుకొని.. ఇప్పుడు భారత జట్టుతో కలిసి ఇంగ్లాండ్ లో ఉన్నాడు. ఇక టీం ఇండియా ఒక్క టెస్ట్ తో పర్యటనను ప్రారంభించనుంది. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ మొదటి ఇన్నింగ్స్ లో 33 పరుగులు చేసి వెనుదిరిగాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో 68 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు అని చాలా మంది అంటున్నారు. అందులో ఇప్పుడు భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరిపోయాడు.

Advertisement

తాజాగా సెహ్వాగ్ మాట్లాడుతూ… కోహ్లీకి చెడ్డ రోజులు పోయాయి. మంచి రోజులు వచ్చాయి. కోహ్లీ చివరగా సెంచరీ ఎప్పుడు చేసాడు అనే విషయం నాకే కాదు.. ఎవ్వరికి గుర్తు లేదు. కానీ ప్రస్తుతం కోహ్లీని చూస్తుంటే.. మళ్ళీ పాత విరాట్ వచేసినట్లే కనిపిస్తుంది. అది మనకు కోహ్లీ ప్రాక్టీస్ మ్యాచ్ లో చేసిన పరుగులే చెబుతున్నాయి. నాకైతే ఈ నెల 1 నుండి ప్రారంభం కానున్న టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ భారీగా పరుగులు చేస్తాడు అని అనిపిస్తుంది అంటూ సెహ్వాగ్ కామెంట్స్ చేసాడు. అయితే కోహ్లీ హాఫ్ సెంచరీ చేస్తే ఫామ్ లోకి వచ్చినట్లు కాదు అని.. సెంచరీ చేస్తేనే వచ్చినట్లు అని కొంతమంది అంటున్నారు. చూడాలి మరి ఈ టెస్ట్ లో విరాట్ ఏం చేస్తాడు అనేది.

ఇవి కూడా చదవండి :

రోహిత్ పై తన కోపాన్ని వ్యక్తపరిచిన పాండ్య…!

మళ్ళీ కెప్టెన్సీ చేయనున విరాట్ కోహ్లీ.. ఎందుకో తెలుసా..? 

Visitors Are Also Reading