Home » త్రివిక్రమ్‌కి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..పవన్ కళ్యాణ్ కు ఆ శాపం ఉంది !

త్రివిక్రమ్‌కి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..పవన్ కళ్యాణ్ కు ఆ శాపం ఉంది !

by Bunty
Ad

బ్రో సినిమాపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రో సినిమా తమిళంలో ఓటీటీలో హిట్ అయ్యింది.. దీన్ని తెలుగులో త్రివిక్రమ్ చేశారు..కానీ మూవీ అట్టర్ ఫ్లాఫ్ అయింది అంటూ చురకలు అంటించారు. సినిమాల గురించి మాట్లాడాల్సిన అనివార్య పరిస్థితిని చిత్ర నిర్మాతలు తీసుకుని వచ్చారని త్రివిక్రమ్ పై సెటైర్లు వేశారు అంబటి రాంబాబు. నన్ను అవమానించే విధంగా శ్యాంబాబు అనే క్యారెక్టర్ ను పెట్టారు.. ఈ సినిమా సక్సెస్ అయ్యిందని ప్రచారం చేస్తున్నారని అగ్రహించారు.

Advertisement

ఇలా రాజకీయ నేతల పాత్రలు పెట్టవద్దని హెచ్చరించారు. వాస్తవంగా ఈ బ్రో సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.. కలెక్షనే దీనికి ఆధారం అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు సుమారుగా 50 నుంచి 60 కోట్లు వసూలు చేసింది.. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 50 కోట్లు పైనే అని తెలిపారు. అంటే పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ కూడా వచ్చే పరిస్థితి ఈ సినిమాకు లేదని.. నేను గతంలోనే చెప్పాను పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక ఆడవని అంటూ గుర్తు చేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు.

Advertisement

వారాహి అనే పవిత్రమైన పేరు పెట్టి అమ్మవారిని తన కాళ్ళ కింద పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు.. అమ్మవారి శాపం తగులుతుందని పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చాడు అంబటి‌. రాజకీయంగా, సినిమాపరంగా పవన్ ఇక గెలిచే అవకాశం లేదు.. చంద్రబాబు ఇవ్వాల్సిన ప్యాకేజీని సినిమా రూపంలో టీజే విశ్వప్రసాద్ ద్వారా అందజేశారన్నారు. టీజే విశ్వప్రసాద్ బ్లాక్ మనీని పవన్ కళ్యాణ్ కు విజయవంతంగా అందజేశారని ఆరోపణలు చేశారు అంబటి రాంబాబు.

ఇవి కూడా చదవండి

శ్రీ లీల కారణంగానే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందా…!

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

శ్రీ లీల కారణంగానే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందా…!

Visitors Are Also Reading