Home » ఆ ఓటిటీ చేతికి “యశోద” డిజిటల్ రైట్స్ !

ఆ ఓటిటీ చేతికి “యశోద” డిజిటల్ రైట్స్ !

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఇటీవల పుష్ప చిత్రంలో కూడా ఐటమ్ సాంగ్ లో నటించి సోషల్ మీడియాని షేక్ చేసింది. ప్రస్తుతం సమంత చేతిలో శాకుంతలం, యశోద, ఖుషి వంటి చిత్రాలతో చాలా బిజీగా ఉంది.

Also Read : 1962 ANR-NTR మధ్య 3 సార్లు పోటీ.. గెలుపెవరిదంటే..!!

Advertisement

ఇందులో లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ఫిలిం “యశోద”. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. యశోద చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలింగ కృష్ణ ప్రసాద్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.హరి, హరీష్ ద్వయం ఈ చిత్రానికి దర్శకులు. నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు.

Advertisement

Also Read : “కాంతార, రంగస్థలం” లో ఉన్న ఈ కామన్ పాయింట్ ను గుర్తించారా..?

ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకులలో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో సమంత పర్ఫామెన్స్ మరో లెవెల్ లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఈ చిత్రం ప్రైమ్ వీడియోలోకిి రానుంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే నవంబర్ 11 వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read : సినిమాల్లో నటించాలంటే సభ్యత్వం ఉండాల్సిందే అంటూ వార్నింగ్ ఇచ్చిన మంచు విష్ణు..!!

 

Visitors Are Also Reading