Home » సినిమాల్లో నటించాలంటే సభ్యత్వం ఉండాల్సిందే అంటూ వార్నింగ్ ఇచ్చిన మంచు విష్ణు..!!

సినిమాల్లో నటించాలంటే సభ్యత్వం ఉండాల్సిందే అంటూ వార్నింగ్ ఇచ్చిన మంచు విష్ణు..!!

by Sravanthi Pandrala Pandrala

తెలుగు ఇండస్ట్రీలో మంచు వారి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. మంచు మోహన్ బాబు కుమారుడిగా మంచు విష్ణు కూడా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే మా అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.. అయితే ఆయన తాజాగా విలేకర్ల సమావేశంలో కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) లో సభ్యత్వం ఉన్న వ్యక్తులకు మాత్రమే నటించే అవకాశం ఇవ్వాలని, దీని గురించి నిర్మాతలతో మాట్లాడదామని ఘాటైన వార్నింగ్ ఇచ్చారు.. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది గడిచిన సందర్భంగా ఆయన ఈ మాటలు మాట్లాడారు.. అయితే దీనిపై నెటిజన్లు మాత్రం ఓ రేంజ్ లో మంచు విష్ణు కు కౌంటర్ లు ఇస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

also read:కీర్తి సురేష్ కి మృణాల్ ఠాకూర్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?

మంచు విష్ణు హీరోగా జిన్నా మూవీ ఈనెల 21వ తేదీన విడుదలవుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ తరుణంలో ఆయన మా లో సభ్యత్వం ఉంటేనే సినిమాల్లో చేయాలని వాదన తీసుకురావడంతో, ఈ విజయానికి బదులుగా ఒక నెటిజన్ జిన్నా సినిమాలో చేసిన వారంతా మా లో సభ్యత్వం ఉన్న వారేనా, ఇందులో సన్నీలియోన్ కి కీలక పాత్ర ఇచ్చారు. ఆమె కూడా మా లో నెంబరే నా అంటూ మంచు విష్ణు కు దిమ్మతిరిగే ప్రశ్న వేశాడు. అయితే సభ్యత్వం అనేది అందరూ తీసుకోవాలి..తీసుకుంటారు.. లేకపోతే ఎక్కడినుంచో వచ్చి తెలుగు నిర్మాతలు డబ్బు తీసుకుని వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటామా అంటూ మంచు విష్ణు మీడియా ముందు కాస్త గట్టిగానే అన్నాడు.

ఒకవేళ నిర్మాతలు ఈ విషయంలో సరిగ్గా రెస్పాండ్ కాకపోతే మా అసోసియేషన్ నుండి సహాయ నిరాకరణ చేస్తామని అన్నారు.. ఈ పరిస్థితి రాదు అని కూడా తెలియజేశారు. జిన్నా సినిమాలో చేసిన వారంతా మా సభ్యులేనా అన్న నెటిజన్ల ప్రశ్నకు మంచు విష్ణు ఈ విషయం ఈ నిర్ణయానికి ముందు తీసిన సినిమా కాబట్టి జిన్నా సినిమాకు మా సభ్యత్వం రూల్ వర్తించదు అనుకుంటే మాత్రం ఆ తర్వాత విష్ణు చేసే సినిమాలకు తప్పనిసరిగా ఈ రూల్ పాటిస్తారని మనం అనుకోవచ్చు. విష్ణు ఏదైనా అన్నాడు అంటే కచ్చితంగా చేస్తాడు.. కాబట్టి ఈ రూల్ కూడా పక్కా ఫాలో అవుతారని అనుకోవాలి.

also read:

Visitors Are Also Reading