Home » చిరంజీవికి తన కూతురితో పెళ్లి చేయడం రామలింగయ్యకు ఇష్టం లేదా..?

చిరంజీవికి తన కూతురితో పెళ్లి చేయడం రామలింగయ్యకు ఇష్టం లేదా..?

by Azhar
Ad
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా.. ఇండస్ట్రీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాగే ఆయన కొడుకు రామ్ చరణ్.. ఇంకా కుటుంబసభ్యులు చాలా మంది సినిమాల్లోనే ఉన్నారు. ఇక చిరంజీవికి ఆయన భార్య సురేఖ అంటే చాలా ఇష్టం అనేది అందరికి తెలిసిందే. కానీ సురేఖకు చిరంజీవికి పెళ్లి చేయడం అనేది అల్లు రామలింగయ్య గారికి మొదట ఇష్టం లేదు అని తెలుస్తుంది.
తాజాగా అల్లు రామలింగయ్య కొడుకు.. సురేఖ సోదరుడు అయిన అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి, సురేఖల పెళ్లి గురించి మాట్లాడారు. అయితే వీరి పెళ్లి ఆలోచన అనేది మొదట మా అమ్మకు వచ్చింది అని చెప్పిన.. అల్లు అరవింద్.. ఆ తర్వాత ఈ విషయం మా నాన్న దగ్గరకు తీసుకెళ్తే.. సినిమా అతను అతనికి అమ్మాయిని ఇవ్వడం ఏంటి అని.. ఆ విషయాన్ని తోసేశారు అని చెప్పాడు.
ఆ తర్వాత ఇదే విషయం నేను చెప్పిన వినలేదు అని అన్న అల్లు అరవింద్.. కొన్ని రోజులకు చిరంజీవి.. మా నాన్న అల్లు రామలింగయ్య ఒక్క సినిమా షూటింగ్ కోసం కలిసి బయటకు వెళ్లారు. అక్కడే చిరంజీవి అలవాట్లు.. మిగితా విషయాలు మా నాన్న తెలుసుకున్నారు. అప్పుడు చిరంజీవి గురించి మొత్తం మంచిగా తెలిసిన తర్వాతే మా నాన్న చిరంజీవి, సురేఖ పెళ్లికి ఒప్పుకున్నారు అని అల్లు అరవింద్ పేర్కొన్నాడు.

Advertisement

Visitors Are Also Reading