Home » జ‌యం నుండి జాను వ‌ర‌కూ అల్లు అర్జున్ చేతులారా వ‌దులుకున్న 10 బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఇవే.!

జ‌యం నుండి జాను వ‌ర‌కూ అల్లు అర్జున్ చేతులారా వ‌దులుకున్న 10 బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఇవే.!

by AJAY
Ad

కొన్ని సినిమాలు మొద‌ట త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చినా హీరోలు క‌థ న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నో డేట్స్ స‌ర్దుబాటు కాక‌పోవ‌డం వ‌ల్ల‌నో రిజెక్ట్ చేస్తుంటారు.

Advertisement

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కొన్ని మంచి సినిమాల‌ను రిజెక్ట్ చేశారు. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….

నితిన్ హీరోగా న‌టించిన జయం సినిమా అప్ప‌ట్లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమాకు యూత్ ఫిదా అయ్యారు. అయితే నిజానికి ఈ సినిమా అల్లు అర్జున్ వ‌ద్ద‌కు వెళ్లింది. కానీ ఆయ‌న రిజెక్ట్ చేయ‌డంతో నితిన్ వ‌ద్ద‌కు వెళ్లింది.

భోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మొద‌టి సినిమా భ‌ద్ర‌. ఈ సినిమాలో ర‌వితేజ హీరోగా న‌టించ‌గా సూప‌ర్ హిట్ అయ్యింది. కాగా ఈ సినిమా మొద‌ట బ‌న్నీ వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్ప‌టికీ ఆయ‌న రిజెక్ట్ చేశారు. నాగ‌చైత‌న్య కెరీర్ లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా100 ప‌ర్సెంట్ ల‌వ్. ఈ సినిమాకు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మొద‌ట ఈ సినిమా క‌థ‌ను బ‌న్నీకే వివ‌రించారు.కానీ ఈ ల‌వ్ స్టోరి రొటిన్ గా ఉంద‌ని బ‌న్నీ రిజెక్ట్ చేశార‌ట‌.

Advertisement

 

విజ‌య్ దేవ‌ర‌కొండ సందీప్ రెడ్డి కాంబినేష‌న్ లో వ‌చ్చి ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా మొద‌ట బ‌న్నీ వ‌ద్ద‌కే వెళ్లింది. కానీ బ‌న్నీ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. అంతే కాకుండా ఈ సినిమాను శ‌ర్వానంద్ కూడా మిస్ చేసుకున్నారు. నాని హీరోగా వ‌చ్చిన గ్యాంగ్ లీడ‌ర్ సినిమా ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు తెగ‌న‌చ్చేసింది. అయితే ఈ సినిమా కూడా మొద‌ట అల్లు అర్జున్ వ‌ద్ద‌కు వెళ్లింది.

విజ‌య్ దేవ‌రకొండ హీరోగా న‌టించిన బ్యూటిఫుల్ ల‌వ్ స్టోరీ గీతాగోవిందం మొద‌ట అల్లు అర్జున్ వ‌ద్ద‌కు వెళ్లింది. కానీ ఈ సినిమాను రిజెక్ట్ చేయ‌డంతో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో విజ‌య్ దేవ‌రకొండ‌తో తీశారు. సిద్దార్థ్ హీరోగా నటించిన క్యూట్ ల‌వ్ స్టోరీ బొమ్మ‌రిల్లుబ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఈ సినిమా కూడా మొద‌ట బ‌న్నీ వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్ప‌టికీ ఆయ‌న రిజెక్ట్ చేశారు.

ALSO READ :బాలయ్య బాబు ఖర్చులు చూసి ఆశ్చర్యపోయిన అన్నగారు.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..!

Visitors Are Also Reading