Home » ఆర్సీబీ విజయంపై సిద్ధార్థ్ కాంట్రవర్సీ ట్వీట్..నెటిజన్స్ ఏమంటున్నారంటే..?

ఆర్సీబీ విజయంపై సిద్ధార్థ్ కాంట్రవర్సీ ట్వీట్..నెటిజన్స్ ఏమంటున్నారంటే..?

by Anji

మొన్న జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆర్సీబీ మహిళలు కప్ ఎత్తగానే బెంగళూరు వీధుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. అలాగే సోషల్ మీడియా వేదికగానూ స్మృతి మందన్నా టీమ్ కు విషెస్ వెల్లువెత్తాయి. ఈ మేరకు నటుడు సిద్ధార్థ్ కూడా ట్వీట్ చేశారు. అయితే అతను ఏ ఉద్దేశంతో ట్వీట్ చేశాడో తెలియదు కానీ అది కాస్తా వివాదాస్పదంగా మారింది.

పలువురు నెటిజన్లు సిద్ధూను తప్పుపట్టారు. బెంగళూరు వీధుల్లో ‘ఆర్‌సిబి’ జట్టు విజయాన్ని సంబరాలు చేసుకుంటున్న పురుషుల వీడియోను సిద్ధార్థ్ షేర్ చేశాడు. అలాగే ‘ఒక టోర్నమెంట్‌లో మహిళల జట్టు ట్రోఫీని గెలుచుకుంది. కానీ రోడ్డుపై సంబరాలు చేసుకునేందుకు ఒక్క మహిళ కూడా లేదు. భారతదేశ పితృస్వామ్య వ్యవస్థకు ఇది సరైన ఉదాహరణ’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చాడు సిద్ధార్థ్‌. ఇది అభిమానులు, నెటిజన్లకు అసలు అంతు పట్టలేదు. అసలు నీ ఉద్దేశమేంటి? మహిళల విషయాన్ని మగవాళ్లు సెలబ్రేట్ చేసుకోకూడదా? అంటూ సిద్దూపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

తన మొదటి ట్వీట్ పై క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ చేశాడు సిద్ధార్థ్‌.. ‘పైన ఉన్న ట్వీట్ పై పూర్తి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. భారత దేశంలోని పబ్లిక్ ప్లేస్ లలో మహిళలు స్వేచ్ఛగా తిరగలేరన్నది నా ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా రాత్రి, అర్ధరాత్రి సమయాల్లో. ఓ మహిళల జట్టు గెలిచిన సందర్భంలోనూ పురుషుల్లాగే మహిళలు కూడా వీధుల్లో సంబరాలు చేసుకోలేకపోతున్నారే అనే నేను చెప్పాలనుకున్నాను’ అని వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ నెటిజన్స్ సిద్ధార్థ్ ను ట్రోల్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపించారు.

Also Read : త‌న భ‌ర్త గురించి ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదో క్లారిటీ ఇచ్చిన ఇలియానా..!

Visitors Are Also Reading