Home » పెళ్లికి సిద్ధమైన అల్లు అర్జున్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా ? 

పెళ్లికి సిద్ధమైన అల్లు అర్జున్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా ? 

by Anji
Ad

ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రెటీలు వరుసగా పెళ్లిల వైపు మనస్సు తిప్పుతున్నారు. ఒకప్పుడు పెళ్లిలు చేసుకోవడానికి అసలు ఇంట్రెస్ట్ అనేదే చూపించే వాళ్లు కాదు. కానీ ఇప్పుడు అయితే ఒకరి తరువాత ఒకరు బాగా వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ పోతున్నారు. చాలా వరకు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ పెళ్లి జరిగిన తరువాత సరిగ్గానే ఉంటారనుకోవడం పొరపాటే అని చెప్పాలి.  ఎందుకు అంటే ప్రేమించినంత కాలం వారి మధ్య ఎలాంటి గొడవలు లేకపోయినా అదేంటో పెళ్లి జరిగిన వెంటనే గొడవలు మొదలవుతుంటాయి.

Advertisement

సెలబ్రెటీల పెళ్లి విషయాలు తెగ వైరల్ అవుతాయి. ఎవరైనా హీరోయిన్లు పెళ్లి చేసుకుంటున్నారని తెలిస్తే.. వెంటనే విడాకులు ఎప్పుడూ అంటూ రచ్చ చేస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే త్వరలో మరో హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఆమె ఎవ్వరో కాదు.. అల్లు అర్జున్ తో కలిసి ఇద్దరమ్మాయిలతో.. సరైనోడు వంటి సినిమాల్లో నటించింది కేథరిన్. ఈ ముద్దుగుమ్మ మొదటిసారిగా సినీ ఇండస్ట్రీకి కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాగా ఆ తరువాత చమ్మక్ చల్లో మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.  తొలి సినిమాతో కొంతవరకు సక్సెస్ అందుకుంది. పైసా, రుద్రమదేవి, సరైనోడు, ఇద్దరమ్మాయిలతో, గౌతమ్ నంద, నేనే రాజు నేనే మంత్రి, వరల్డ్ ఫేమస్ లవర్, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాల్లో నటించగా సరైనోడులో ఎమ్మెల్యే పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అంతగా అవకాశాలు లేకపోయే సరికి ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిత్యం ఫొటోలను షేర్ చేస్తూ ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది.

Advertisement

కెరీర్ ప్రారంభంలో మంచి ఫిజిక్ తో ఉన్న ఈ భామ కాస్త బొద్దుగానే తయారైంది. అయినప్పటికీ గ్లామర్ షో ద్వారా అందాల విందు వడ్డిస్తుంటుంది. ఇప్పటివరకు ఈ బ్యూటీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్న విషయం తెలిసిందే. గతంలోనే ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం కొనసాగించిందని.. అతనికి బ్రేకప్ చెప్పిందని వార్తలు వినిపించాయి. త్వరలోనే ఈమె ఓ ఇంటికి కోడలు కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తన చిన్నప్పటి ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతుందని.. కొంత కాలం నుంచి అతనితో ప్రేమలో ఉందని.. ఆ విషయం ఇంట్లో వాళ్లకి చెప్పడంతో వాళ్లు వెంటనే ఓకే అన్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఈ విషయం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కొందరూ నెటిజన్స్ అయితే పెళ్లి ఒకే కానీ.. విడాకులు కూడా ఎప్పుడో చెప్పేస్తే ఓ పని అయిపోతుందని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.  ఈ హీరోయిన్ పెళ్లి వాస్తవమో కాదో తెలియాలంటే మాత్రం అధికారికంగా ప్రకటిస్తే కానీ క్లారీటీ రాదు. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

టాలీవుడ్ హీరోలకు ఉన్న కార్లు..లిస్ట్ ఇదే

హీరోయిన్ నందిత శ్వేత అంత లావు కావడానికి కారణం ఏంటో తెలుసా ? 

సుకుమార్, దిల్ రాజులకు షాక్ ఇచ్చిన శ్రీలీల !

Visitors Are Also Reading