Home » ప్రభాస్ అభిమానిని చితకబాదిన అల్లు అర్జున్ ఫ్యాన్స్..!

ప్రభాస్ అభిమానిని చితకబాదిన అల్లు అర్జున్ ఫ్యాన్స్..!

by Anji
Ad

సాధారణంగా సినీ హీరోలు లేదా హీరోయిన్స్ పై కొందరికీ అభిమానం ఉంటుంది. మరికొందరికీ ఉండదు. అయితే అభిమానం ఉండాలి కానీ.. మరీ పిచ్చి ఉండకూడదు. అది ఎప్పటికైనా మోసమే.  ముఖ్యంగా స్టార్ హీరోలకు అభిమానులం అని చెప్పుకునే కొందరూ యువకులు సదరు కథానాయకులకే తలవంపులు తెచ్చేవిధంగా నీచంగా ప్రవర్తిస్తున్నారు. అవతలి హీరో అభిమానులతో పొట్లాడేందుకు వెనుకాడటం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత అభిమానుల మధ్య ఫ్యాన్స్ వార్ కొనసాగడం చాలా ఎక్కువ అయిపోయింది.

Advertisement

Advertisement

గతంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఫ్యాన్స్  పలు సందర్భాల్లో గొడవలకు దిగిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే.  తాజాగా బెంగళూరులో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రభాస్ ఫ్యాన్ ని బెంగళూరులో 10 మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కలిసి చితకబాదిన ఘటన సోషల్ మీడియాలో పెను దుమారమే రేపింది. రక్తం వచ్చే విధంగా ప్రభాస్ ఫ్యాన్స్ ని కొట్టి.. మరోసారి మా అల్లు అర్జున్ జోలికి వస్తే.. ఇలాగే జరుగుద్ది అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనిని నెటిజన్స్ బెంగళూరు పోలీసులకు ట్యాగ్ చేసి విచక్షణ రహితంగా ఒక్కడిని చేసి చితకబాదిన 10 మందిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కూడా వెంటనే స్పందించి ఆ 10 మంది అల్లు అర్జున్ అభిమానులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read :  ‘విశ్వంభర’ లో డబుల్ రోల్ లో నటించనున్న త్రిష..?

Visitors Are Also Reading