Home » శుభవార్త… రేపు టెట్ నోటిఫికేషన్..!

శుభవార్త… రేపు టెట్ నోటిఫికేషన్..!

by Sravya
Ad

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతోంది. ఎప్పటినుండో ఉన్న డిమాండ్ మీద ముందడుగు వేసింది. టెట్ పరీక్ష నిర్వహించడానికి కసరత్తు పూర్తి చేసారు. టెట్ నోటిఫికేషన్ ని గురువారం రిలీజ్ చేయనున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ఏపీ ప్రభుత్వం గురువారం అనగా నాడు ఈ నోటిఫికేషన్ ని రిలీజ్ చెయ్యనున్నారు. గురువారం నుండి 18 వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈనెల 27 నుండి మార్చి 8 వరకు టెట్ పరీక్షలను నిర్వహించబోతున్నారు.

Advertisement

Advertisement

మార్చి 14న ఫలితాలు విడుదల అవ్వబోతున్నాయి ఈ మేరకు అధికారులు చేసిన కసరత్తు ఫలించడం తో నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం టెట్ నోటిఫికేషన్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇంకోపక్క 6,100 టీచర్ పోస్టులో భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. మంత్రి బొత్స బుధవారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 12 నుండి ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తామని బొత్స అన్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading