Home » చిరంజీవి వల్ల నవ్వుల పాలైన సీనియర్ స్టార్ హీరో ఎవరో తెలుసా…?

చిరంజీవి వల్ల నవ్వుల పాలైన సీనియర్ స్టార్ హీరో ఎవరో తెలుసా…?

by Mounika
Ad

ఓ తరంలో స్వయంకృషితో సినిమా ఇండస్ట్రీలో పైకి వచ్చినా స్టార్ హీరోలు ఎవరు అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేర్లు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ. ఈ స్టార్ హీరోల మాదిరిగానే ఆ తర్వాత తరంలో స్వయంకృషితో పైకొచ్చిన హీరో ఎవరని అడగగానే గుర్తుకొచ్చే పేరు చిరంజీవి. చిరంజీవి స్వయంకృషితో సినీ ఇండస్ట్రీలో ఆయన కంటూ ఓ ప్రత్యేకమైనా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఓ సందర్బంలో చిరంజీవి వల్ల ఓ సీనియర్ స్టార్ హీరో నవ్వుల పాలైయ్యారు. ఇంతకీ ఆ హీరో ఎవరు..? అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

టాలీవుడ్‌లో ఎన్టీఆర్ కంటే ముందు అడుగుపెట్టి ఎవర్గ్రీన్ హీరోగా స్టార్ డంని సొంతం చేసుకున్నారు ఏఎన్ఆర్. అప్పటిలో మహిళా ప్రేక్షకులలో ఏఎన్ఆర్ కి ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ఉండేది. ఇంకా చెప్పాలి అంటే ఆయన అప్పటి తరంలో మహిళా ప్రేక్షకుల్లో లవర్ బాయ్ స్టేటస్ ని సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్, శోభన బాబు, కృష్ణ వంటి హీరోలు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న సమయంలోనే చిరంజీవి కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వారితో పలు సినిమాల్లో సెకండ్ హీరోగా నటించారు. కానీ చిరు, అక్కినేని నాగేశ్వరరావుతో మాత్రం నటించలేదు. ఆ అవకాశం చిరంజీవికి 90వ దశకంలో వచ్చింది.

Advertisement

ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ వంటి వారు హీరోగా కొనసాగుతున్న సమయంలోనే ఏఎన్ఆర్ హీరో గానే కాకుండా ఆయన పాత్రకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ లో కూడా నటించి మెప్పించేవారు. అలా తొలిసారి అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి కలిసి నటించిన సినిమా ‘మెకానిక్ అల్లుడు’ 1993లో విడుదల అయ్యింది. ఇద్దరు హీరోలా తొలి కాంబినేషన్‌లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి . బి.గోపాల్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కించారు. లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి హీరోయిన్‌గా నటించింది. ఇక చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన చివరి సినిమా ఇదే కావడం కూడా విశేషం.

మెకానిక్ అల్లుడు చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవిలపై చిత్రీకరించిన ‘గురువా గురువా’ పాట ఎంత ఫేమసో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి కాంబినేషన్‌లో ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీరంగనీతులు’ సినిమాకు రీమేక్గా తీశారు. శ్రీరంగనీతులు చిత్రానికి జిరాక్స్ కాపీలా తెరకెక్కిన మెకానిక్ అల్లుడు సినిమా ప్రేక్షకుల అంచనాలను తలకిందలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యింది. ఆ యేడాది ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి సీనియర్ హీరోలు హిట్ అందుకుంటే.. అక్కినేని నాగేశ్వరావు మాత్రం చిరంజీవితో కలిసి నటించిన  మెకానిక్ అల్లుడు చిత్రంతో విమర్శల పాలైయ్యారు.

మరిన్ని..

Samantha : అమెరికాలో కోట్లు పెట్టి ఇల్లు కొన్న హీరోయిన్ సమంత ?

“ఖడ్గం” తీసిన తర్వాత…చంపేస్తారనే భయంతో వారం రోజులు కృష్ణవంశీ దాక్కున్నాడు !

అన్నగారికి చంద్రబాబు నిజంగానే వెన్నుపోటు పొడిచాడా ? ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్

 

Visitors Are Also Reading