Home » అన్నగారికి చంద్రబాబు నిజంగానే వెన్నుపోటు పొడిచాడా ? ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్

అన్నగారికి చంద్రబాబు నిజంగానే వెన్నుపోటు పొడిచాడా ? ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్

by Bunty
Ad

 

అలనాటి స్టార్ హీరో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎంతో కష్టపడి చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగారు నందమూరి తారకరామారావు. స్టార్ హీరోగా ఎదిగిన సమయంలోనే చాలామంది స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేసి.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు.

Advertisement

ఆయన అనేక రకాల పాత్రలు చేసి స్టార్ హీరోగా ఎదిగిపోయారు. అయితే ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత రాజకీయాలలోకి కూడా నందమూరి తారక రామారావు ఎంట్రీ ఇచ్చారు. ఆ కాలంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు నడుము కట్టుకున్న నందమూరి తారక రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఆయన పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే అంటే కేవలం 9 నెలల లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.

Advertisement

అలాగే 1994 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలోనే తన మామ నందమూరి తారక రామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారని ఇప్పటికి ఓ వార్త తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తూనే ఉంటుంది. అయితే దీనిపై అప్పట్లో నందమూరి తారక రామారావు కూడా చంద్రబాబు కుట్ర గురించి వివరించారు. 1995 కాలంలో చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన మాట వాస్తవం అని విలేకరుల సమావేశంలో నందమూరి తారకరామారావు పేర్కొన్నారు. పిల్లనిచ్చిన మామ అని చూడకుండా తనకు వెన్నుపోటు పొడిచాడని నందమూరి తారకరామారావు ఫైర్ అయ్యారు. అలాంటి సమయంలో ఎర్రం నాయుడు తనకు అండగా నిలిచాడని వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి 

Samantha : అమెరికాలో కోట్లు పెట్టి ఇల్లు కొన్న హీరోయిన్ సమంత ?

దివ్యభారతి చనిపోయి ఇంత మంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిందా…?

World Cup 2023 : హైదరాబాద్ లో పాకిస్తాన్ మ్యాచ్ డేంజర్ అంటున్న పోలీసులు..!

Visitors Are Also Reading