Home »  Agent:కొడుకు సక్సెస్ కావాలని నాగార్జున అమల ఏం చేస్తున్నారో తెలుసా..?

 Agent:కొడుకు సక్సెస్ కావాలని నాగార్జున అమల ఏం చేస్తున్నారో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. ఇందులో ముఖ్యంగా నాగేశ్వర్ రావు తర్వాత నాగార్జున స్టార్ హీరోగా ఎదిగారు.  ఇక ఆయన వారసులుగా నాగచైతన్య అఖిల్ ఎంట్రీ ఇచ్చిన అంతగా సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఇక నాగచైతన్య ఓ మోస్తారు హీరోగా గుర్తింపు సాధించినా కానీ,  అఖిల్ మాత్రం ఇంకా ఎదగలేక పోతున్నారు.  ఈ తరుణంలో అఖిల్ సక్సెస్ కోసం నాగార్జున మరియు అమల ఏం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..
అఖిల్ తాజాగా నటించిన ఏజెంట్ సినిమా శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఇక ఈ సినిమా అఖిల్ కెరీర్ ని మార్చబోతున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో  అనిల్ సుంకర నిర్మాతగా  తెరకెక్కిన ఈ సినిమా కోసం రెండు సంవత్సరాలు పనిచేశారు. ప్రస్తుతం అఖిల్ కెరియర్ ఈ సినిమా పైనే ఆధారపడి ఉంది. ఇక ఈ సినిమా సక్సెస్ కాకపోతే ఆయన కెరియర్ దాదాపుగా ముగిసినట్టే. అందుకే ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డారని తెలుస్తోంది. అఖిల్ ఈ సినిమాలో ఎలాగైనా సక్సెస్ కావాలని తన తండ్రి నాగార్జున తల్లి  అమల పరితపిస్తున్నారట.
సినిమా హిట్ కావాలని కోరుకుంటూ తిరుపతి వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒక యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో  మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి  ప్రధాన పాత్రలో నటిస్తున్నారట.  అలాగే బాలీవుడ్ నటుడు డీనో మోరి  కూడా విలన్ గా చేస్తున్నారట. అయితే ఈ సినిమా కోసం అఖిల్ ఎంత కష్టపడ్డారో ప్రమోషన్స్ కోసం కూడా అంతే కష్టపడుతున్నారు. ఎన్నో ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. సినిమా సక్సెస్ ఇస్తుందని చాలా నమ్మకంతో ఉన్నాడు. మరి ఈ సినిమా అఖిల్ కు సక్సెస్ ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం.

Advertisement

Visitors Are Also Reading