Home » Samantha: సమంతకు గుడి కట్టిన అభిమాని… ఏపీలో ఎక్కడంటే?

Samantha: సమంతకు గుడి కట్టిన అభిమాని… ఏపీలో ఎక్కడంటే?

by Bunty
Ad

హీరోయిన్ సమంత గురించి తెలియని వారుండరు.  తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అంద చందాలతో, నటన చాతుర్యంతో ఎంతో గుర్తింపును సాధించింది సమంత. ఇప్పటికే ఆమె నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. దాదాపు సౌత్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరూ అగ్ర హీరోలతో ఆమె నటించింది.

Read also : తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉద్యోగాలు…జీతం రూ. 35 వేలు

Advertisement

అలాంటి సమంత ఇప్పటికీ తరగని అందంతో దూసుకుపోతోంది. సమంత సినిమాల్లో బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. అయితే, తాజాగా బాపట్ల జిల్లాకు చెందిన యువకుడు సైతం అభిమాన హీరోయిన్ సమంత కోసం తన ఇంటి ప్రాంగణంలోనే గుడి నిర్మించాడు.

Advertisement

read also : ఏంటి ఈ వేషాలు అర్జున్.. ముక్కులో వేలుపెట్టుకొని గెలుకుతున్నావ్ !

Die Hard fan, Samantha: సమంతకు గుడి కట్టిన వీరాభిమాని.. తిరుపతి, కడప దర్గాకు మొక్కుబడి యాత్ర! - big fan of samantha constructed a temple to her - Samayam Telugu

చుండూరు మండలం, ఆలపాడు గ్రామానికి చెందిన తెనాలి సందీప్… సమంతకు వీరాభిమాని. చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ వారి ప్రాణాలు కాపాడుతున్న సామ్ కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచించి గుడి నిర్మాణానికి పూనుకున్నాడు. ‘సమంత గారు మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్నందుకు తిరుపతి, చెన్నై, నాగపట్నం, కడప దర్గా దైవ క్షేత్రములకు మొక్కుబడి యాత్ర’ అని రాయించిన ఫ్లెక్సీని ఈ సందర్భంగా సందీప్ ప్రదర్శించాడు.

read also : ఉద్యోగికి రూ. 1500 కోట్ల ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ముఖేష్ అంబానీ

Visitors Are Also Reading