Telugu News » Blog » విశాఖ బీచ్ లో గర్భిణీ మృ*దేహం కేసు…. వెలుగులోకి సంచలన నిజాలు…?

విశాఖ బీచ్ లో గర్భిణీ మృ*దేహం కేసు…. వెలుగులోకి సంచలన నిజాలు…?

by AJAY
Ads

విశాఖ బీచ్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన‌ గర్భిణీ శ్వేత కేసులో సంచలనాలు బ‌య‌టకు వస్తున్నాయి. అత్త మామల వేధింపుల వల్లే తమ కూతురు శ్వేత చనిపోయిందని తల్లి రమాదేవి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. శ్వేత ఇంటి నుండి బయలుదేరే గంట ముందు వరకు తన భర్త మణికంఠతో గొడవ పడిందని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. అంతే కాకుండా శ్వేత తల్లి సంచలన ఆరోపణ‌లు చేశారు.

Advertisement

తన కూతురు ఐదు నెలల గర్భిణీ అని కడుపుతో ఉన్నప్పటికీ కనికరించకుండా అత్తమామలు చిత్రహింసలు పెట్టేవారని చెప్పారు. ఇంట్లో పనులన్నీ ఆమెతోనే చేయించేవారని… అత్త మామలు చెప్పిన పనులు చేయాలంటూ భర్త ఫోన్లో ఆదేశాలు జారీ చేసే వారని అన్నారు. అత్తింటివారు ఇబ్బంది పెడుతున్నారని రోజూ తన కూతురు ఫోన్ చేసి ఏడ్చేదని అన్నారు. సివిల్స్ కు ప్రిపేర్ అవుతానని చెప్పిందని…. పెళ్లైన‌ తర్వాత చదివించకుండా వంటింటికే పరిమితం చేశారని అన్నారు.

Advertisement

శ్వేత నటిస్తుందని అత్తింటి వేధింపులు భర్త టార్చర్ వల్లనే శ్వేత ప్రాణం తీసుకుందని అన్నారు. ఇక శ్వేత చనిపోయే ముందు రాసిన సూసై* నోట్ దొరికింది అందులో….. చిట్టి నాకు ఎప్పుడో తెలుసు. నేను లేకుండా నువ్వు బిందాస్ గా ఉంటావని. నీకు అసలు ఏమాత్రం ఫరక్ ఉండదు. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్…. అండ్ న్యూ లైఫ్. చాలా మాట్లాడడానికి ఉన్నా నేను ఏమీ మాట్లాడటం లేదు బికాస్ నువ్వు బయటకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యు నో ఎవ్రీథింగ్.

జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్… అంటూ పేర్కొంది. ఇదిలా ఉంటే శ్వేత భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాదులో ఉంటున్నాడు. విశాఖపట్నంలో అత్తమామల దగ్గర శ్వేత‌ ఉంటుంది. మంగళవారం అత్తతో గొడవ జరిగిన తర్వాత ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అంతేకాకుండా భర్తతో ఫోన్ లో గొడవ పడింది. ఆ తర్వాత బీచ్ లో శ‌వ‌మై క‌నిపించింది.

Advertisement

ALSO READ : Samantha: సమంతకు గుడి కట్టిన అభిమాని… ఏపీలో ఎక్కడంటే?

You may also like