Home » ఆదిపురుష్ టీజర్ వచ్చేది అప్పుడే..!

ఆదిపురుష్ టీజర్ వచ్చేది అప్పుడే..!

by Azhar
Ad
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు అనేవి చేస్తున్నాడు. అయితే బాహుబలి సినిమాతో ఇండియా వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు అనేది తెచ్చుకున్నా ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఆదిపురుష్ కూడా ఒక్కటి. అయితే బాహుబలి తరువాత ప్రభాస్ నుండి వచ్చిన రెండు సినిమాలు అంతగా జనాలను మెప్పించలేదు.
ఇక ప్రభాస్ ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్న అందులో ముందుగా విడుదల అయ్యే సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ అనేది ఇప్పటికే పూర్తి అయ్యింది. కానీ ఇంకా ఈ సినిమా నుండి ఏ అప్డేట్ రాలేదు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతుండటంతో ఈ సినిమా పైన ఫ్యాన్స్ కు ఆసక్తి అనేది ఎక్కువ ఉంది అనే చెప్పాలి. కానీ ఆదిపురుష్ చిత్ర యూనిట్ ఇప్పటివరకు ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేదు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క టీజర్ డేట్ అనేది ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తుంది. ఈ ఏడాదిలో ఢిల్లీలో జరిగే దసరా సంబరాల్లో ప్రభాస్ పాలుపంచుకోనున్నాడు అని తెలుస్తుంది. అయితే అక్కడే ఆదిపురుష్ యొక్క టీజర్ కూడా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే దీని యొక్క అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తుంది. అదే నిజం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అనే చెప్పాలి.

Advertisement

Visitors Are Also Reading