Telugu News » Blog » కేఎల్ రాహుల్ త్యాగం చేయాలి..!

కేఎల్ రాహుల్ త్యాగం చేయాలి..!

by Manohar Reddy Mano
Ads
భారత జట్టు భవిష్యత్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ప్రస్తుతం ముందు వరుసలో ఉన్నాడు. అలాగే ఇప్పుడు జట్టుకు వైస్ కెప్టెన్ గా కూడా కొనసాగుతున్నాడు. వైస్ కెప్టెన్ అంటే జట్టు మేలు కోసం ఆలోచించాలి కాబట్టి.. అతను త్యాగం చేయాలి అని అంటున్నాడు భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్. అయితే గాయం నుండి కోలుకొని తిరిగి భారత జట్టులోకి వచ్చిన రాహుల్ ఆసియా కప్ లో రాణించలేదు.
ఓపెనర్ గా ఒక్క ఆఖరి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ మినహా.. మొత్తం విఫలం అయ్యాడు. ఇక అదే మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. కాబట్టి ప్రపంచ కప్ లో అతను ఓపెనర్ గా రావాలని గవాస్కర్ అన్నాడు. కోహ్లీకి ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది. అతను ఓపెనర్ గానే ఐపీఎల్ లో ఒక్కే సీజన్ లో నాలుగు సెంచరీలు చేసాడు.
అలాగే గతంలో భారత జట్టుకు కూడా ఓపెనర్ గా వచ్చాడు. కాబట్టి రోహిత్ శర్మతో కలిసి కోహ్లీ ఓపెనర్ గా వస్తే బాగుంటుంది. ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడం కోహ్లీ కూడా ఎంజాయ్ చేస్తాడు. కాబట్టి ఓపెనర్ అయిన కేఎల్ రాహుల్ ఆ స్థానానికి త్యాగం చేసి వన్ డౌన్ లో రావాలి. ఒకేవేళ అతను మిడిల్ ఆర్డర్ లో వస్తే అక్కడ మనకు ఉన్న సమస్య కూడా తీరిపోతుంది అని గవాస్కర్ పేర్కొన్నారు.