కశ్మీర్ ఫైల్స్ తర్వాత ఆ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా ది కేరళ స్టోరీ. అదాశర్మ మెయిన్ రోల్ లో నటించిన ది కేరళ స్టోరీ మూవీ భారతదేశం లోనే సెన్సేషనల్ బాక్సాఫీస్ రన్ ని మెయిన్ టైన్ చేస్తోంది. ఎన్ని వివాదాలు అడ్డొచ్చినా.. రాష్ట్రాలకు రాష్ట్రాలే సినిమాను బ్యాన్ చేసిన కలెక్షన్లు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల కంటే కూడా పదో రోజు ఎక్కువ కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఓ లేడి ఓరియంటల్ చిన్న సినిమా కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా వారం తిరిగే లోపే రూ.82 కోట్లు, రెండో వారం ఎండ్ లోపు రూ.150 కోట్లు వసూలు చేయడం గొప్ప విషయం అనే చెప్పాలి.
Advertisement
మహిళలకు బలవంతంగా మతమార్పిడి చేసి ఉ*వాద సంస్థ ఐసీ*లో చేర్పించి పలు కార్యకలాపాలు చేపట్టే విధంగా శిక్షణ ఇస్తున్నారనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. దీనిపై కాంగ్రెస్ తో పాటు పలు విపక్షాలు భారీ ఎత్తున నిరసన తెలిపాయి. మూవీపై నిషేధం విధించిన రాష్ట్రాల్లో కొన్నిచోట్ల తాజాగా ప్రదర్శనకు అనుమతులు లభించాయి ఈ వివాదాలు ఏవి సినిమాపై ప్రభావం చూపకపోవడం రోజు రోజుకు పెరుగుతున్న ప్రేక్ష కాదారణ పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.
Advertisement
ఈ సినిమా విజయం పై నటి ఆదాశర్మ స్పందిస్తూ.. ఇంత పెద్ద విజయం సాధిస్తుందని తాను అస్సలు ఊహించలేదని తెలిపింది. ఈ విజయానికి కారణం అభిమానులేనని కోట్లాది మంది ఈ సినిమాను చూశారని సంతోషం వ్యక్తం చేసింది ఆదాశర్మ. ‘నా సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని కలలో కూడా ఊహించలేదు. కానీ ఒకనాటిగా ఈ సినిమాలో నటించే అంతసేపు ప్రజలు చూడాలనే ఆశతోనే చేశాను. ఇందులోని భావోద్వేగా సన్నివేశాలు ప్రేక్షకులకు నచ్చుతాయని గట్టిగా నమ్మాను నా నమ్మకమే నిజమైంది. స్క్రిప్ట్ వినగానే నాకు తెలియకుండానే కన్నీరు వచ్చేసింది అందుకే వెంటనే ఈ సినిమా ఓకే చేశాను. ఈ స్థాయిలో విజయాన్ని అస్సలు ఊహించలేదు’ అని అదా శర్మ సంతోషం వ్యక్తం చేసింది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Virupaksha : విరూపాక్ష ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పటినుంచి అంటే…!