Home » “పోకిరి” లాంటి బ్లాక్ బస్టర్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా…!

“పోకిరి” లాంటి బ్లాక్ బస్టర్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా…!

by AJAY
Ad

మ‌హేశ్ బాబు పూరిజ‌గ‌న్నాత్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా పోకిరి. ఈ సినిమాలో మ‌హేశ్ బాబు మ్యాన‌రిజం….కొట్టే డైలాగులు నెక్స్ట్ లెవల్ ఉంటాయి. సినిమా స్క్రీన్ ప్లే స్పీడ్ గా బెల్లెట్ వేగంగా దూసుకుపోతుంది. సినిమాలో గ‌న్ చూడాల‌నుకో త‌ప్పు లేదు కానీ బుల్లెట్ చూడాల‌నుకోకు చచ్చిపోతావ్….ఎవ‌డు కొడితే దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే పండు గాడు అంటూ మ‌హేశ్ బాబు చెప్పే డైలాగులు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మొద‌ట నుండి జులాయిగా తిరేగే పండుగాడు ఓ సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ అని క్లైమాక్స్ లో రివీల్ చేస్తారు.

Advertisement

దాంతో ఈ సినిమా క్లైమాక్స్ పై ప్ర‌శంస‌లు కురిశాయి. అంతే కాకుండా ఎక్క‌డా క్లైమాక్స్ ను అంచ‌నా వేయ‌కుండా ఈ సినిమా సాగిపోతూ ఉంటుంది. దాంతో ఈ సినిమాకు మ‌హేశ్ బాబు అభిమానులే కాదు సినిమా ప్రేక్ష‌కులు అంద‌రూ ఫ్లాట్ అయ్యారు. ఇక ఈ సినిమాలో ల‌వ్ ట్రాక్ కూడా భ‌లేగా ఉంటుంది. ఈ చిత్రంలో గోవాబ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించిన సంగ‌తి తెలిసిందే. కాగా ఇలియానా ఎరోబిక్ నేర్పించే ట్రైన‌ర్ గా క‌నిపిస్తుంది.

Advertisement

ఇక వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు కూడా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. ఓ క్యారియర్ లు క్యారియ‌ర్ లు ప‌ట్టుకుని తిరుగుతావ్ కానీ ఏనాడైనా తినింపించావా అంటూ మ‌హేశ్ బాబు ఇలియానాతో చెప్పే డైలాగులు ప్రేక్ష‌కుల చేత‌ విజిల్స్ కొట్టించాయి. ఇక ఇలియానా కూడా ఈ సినిమాలో క్యూట్ గా అమాయకంగా కనిపిస్తూ కుర్రాళ్ల మ‌దిని దోచుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ముందుగా పూరిజ‌గ‌న్నాత్ ప‌లువ‌రు బాలీవుడ్ తార‌ల‌ని సంప్ర‌దించార‌ట‌.

అందులో కంగ‌నా ర‌నౌత్ ఒక‌రు. ముందుగా కంగ‌నా ర‌నౌత్ ను ఈ సినిమా కోసం సంప్ర‌దించగా అప్ప‌టికే ఈ బ్యూటీ మ‌రోసినిమాతో బిజీగా ఉంద‌ట‌. అంతే కాకుండా ఆయేషా టకియా, దీపికా ప‌దుకునే, పార్వ‌తి మెల్ట‌న్ ను కూడా సంప్ర‌దించ‌గా వారు రిజ‌క్ట్ చేశార‌ని అప్ప‌ట్లో టాక్. ఇక మొత్తానికి మహేశ్ ఇలియానాల జోడినే ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.

Also read :

ఆ హీరో నాతో బెడ్ షేర్ చేసుకున్నాడు….త‌మిళ స్టార్ హీరో ప‌రువు తీసిన శ్రీరెడ్డి…!

మ‌హేష్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్ ఎప్పుడంటే..?

Visitors Are Also Reading