Home » మ‌హేష్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్ ఎప్పుడంటే..?

మ‌హేష్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్ ఎప్పుడంటే..?

by Anji

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం స‌ర్కారు వారి పాట ఇటీవ‌లే ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటుంది. ఈ త‌రుణంలో సినిమా ప్ర‌మోష‌న్స్ లో జోరును పెంచాల‌ని చిత్ర‌బృందం సిద్ధం అయింది. ఇప్ప‌టికే ఈ సినిమాలోని గ్లింప్స్‌, టీజ‌ర్లు, కొన్ని పాట‌లు విడుద‌ల‌య్యాయి. ఇక ట్రైల‌ర్ కోసం ఎప్పుడు ఎప్పుడు అని మ‌హేష్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మ‌హేష్ ట్రైల‌ర్ కోసం ఎదురుచూస్తున్న వారంద‌రికీ చిత్ర యూనిట్ శుభ‌వార్త చెప్పింది. స‌ర్కారు వారి పాట సినిమా ట్రైల‌ర్ విడుద‌ల తేదీని గురువారం ప్ర‌క‌టించారు.

ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం రూపొందించిన ఈ చిత్రం మే 12న విడుద‌ల అవుతోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు విడుద‌ల వాయిదా ప్ర‌క‌ట‌న త‌రువాత‌.. మే 12న విడుద‌ల తేదీ ఫిక్స్ చేశారు మేక‌ర్స్‌. తాజాగా క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. విడుద‌ల‌కు స‌రిగ్గా ప‌ది రోజుల ముందు అన‌గా మే 02న విడుద‌ల చేస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో పోస్టర్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. ఇక స‌ర్కారు వారి పాట సినిమా యాక్ష‌న్ ప్యాక్డ్‌గా ఉంటుంద‌ని ఇప్ప‌టికే మూవీ మేక‌ర్స్ వెల్ల‌డించారు.

ఈ సినిమా థీమ్‌కు త‌గ్గ‌ట్టుగానే ప‌క్కా మాస్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ట్రైల‌ర్ ను విడుద‌ల చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు. సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ కూడా ఈ ట్రైల‌ర్‌కు వ‌ర్క్ చేయ‌డంగా బిజీగా ఉన్న‌ట్టు స‌మాచారం. ఇదివ‌ర‌కు ఎప్పుడు కూడా మ‌హేష్‌బాబును చూడ‌ని మాస్ లుక్‌లో ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం చూపించబోతున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. చూడ‌డానికి మ‌హేష్ స్టైలిష్‌గా క‌నిపించినా అత‌ని పాత్ర‌లో డిఫ‌రెంట్ షేడ్స్ క‌నిపిస్తాయ‌న్నారు.

Also Read : 

ఊ అంటావా మావా పాట‌కు కోహ్లీ డ్యాన్స్‌.. వీడియో వైర‌ల్‌..!

తెలంగాణ‌లో ప్ర‌భుత్వ ఉద్యోగానికి స‌న్న‌ద్ధం అవుతున్నారా..? ఉద్య‌మంపై ఇలా సిద్ధ‌మ‌వ్వండి

Visitors Are Also Reading