Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » ఇడియట్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి !

ఇడియట్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి !

by Bunty
Ads

స్టార్ హీరోయిన్ రక్షిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందచందాలతో ప్రేక్షకులను మైమరపించింది. కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగినటువంటి నటులలో రక్షిత ఒకరు. తెలుగులో ఇడియట్, శివమణి, నిజం సినిమాలతో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది రక్షిత. ఇడియట్ సినిమాలో రవితేజ సరసన నటించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.

Advertisement

Ad

ఇందులో తన నటనకుగాను అత్యధిక మంది కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు. తల్లిదండ్రులు బిసీ గౌరీశంకర్, మమతారావు కన్నడ నటులు కావడంతో రక్షితకు సినిమాల్లో నటించే అవకాశం చాలా సులువుగా వచ్చింది. తన కెరియర్ సాఫీగా సాగుతుంది అనుకున్న సమయంలో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ నీ వివాహం చేసుకుంది. వివాహ అనంతరం సినిమాలకు పూర్తిగా దూరమై తన కుటుంబానికే సమయాన్ని కేటాయించింది రక్షిత. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైనటువంటి రక్షిత జోగయ్య, డీకే అనేటువంటి సినిమాలను నిర్మించింది.

Advertisement

ప్రస్తుతం రక్షిత కన్నడ షోస్ కు జడ్జిగా వ్యవహరిస్తుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం రక్షిత ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.వివాహం అనంతరం ఒక బిడ్డకు జన్మనిచ్చింది రక్షిత. కొడుకు పుట్టిన అనంతరం తనకు అనారోగ్య సమస్యల వల్ల లావెక్కినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రక్షిత. కాగా, తాను థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. కాగా ఇడియట్ సినిమాలో ఈ బ్యూటీ దుమ్ములేపింది. ఎలాంటి జనరేషన్ లో అయినా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

టీవీ సీరియల్స్ హీరోయిన్స్ ఎంత చదువుకున్నారో తెలుసా…?

కిమ్ కు భయంకరమైన వ్యాధి… బరువు 140 కిలోలు పెరిగాడా!

Comedian Ali : ఫ్లైట్ ప్రమాదం నుంచి బయట పడిన అలీ కుటుంబం.. !

Visitors Are Also Reading