Home » Group 4 notification 2022 Telangana: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్‌.. నేటి నుంచి గ్రూప్‌ 4 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం… ఇలా అప్లై చేసుకోండి.

Group 4 notification 2022 Telangana: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్‌.. నేటి నుంచి గ్రూప్‌ 4 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం… ఇలా అప్లై చేసుకోండి.

by Bunty
Ad

Group 4 notification 2022 Telangana: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాదే ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, ఈ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది కేసీఆర్ సర్కారు. ఇక ఇప్పటికే పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇక Tspsc group 4 notification అటు గ్రూప్-4 నోటిఫికేషన్ ను డిసెంబర్ 1న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Tspsc Group 4 Notification


మొత్తం 9168 గ్రూప్-4 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ ముందుగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 23న ప్రారంభించాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేశారు. ఈరోజు డిసెంబర్ 30 నుంచి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు టిఎస్పిఎస్సి తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడంతో దరఖాస్తు గడువును సైతం పొడిగించారు.

Advertisement

Advertisement

దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 19 వరకు అవకాశం కల్పించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించింది. ఈరోజు దరఖాస్తుల ప్రారంభం సందర్భంగా టీఎస్పీఎస్సీ అనిత రామచంద్రన్ కీలక ప్రకటన చేశారు. ఈనెల 30 నుంచి జనవరి 19వ తేదీ వరకు
అధికారిక వెబ్సైట్ https://www.tspsc. gov.in/ లో
అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. దరఖాస్తు తేదీని పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. అభ్యర్థులంతా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా ఈ పరీక్ష ఏప్రిల్ లేదా మేలో జరగవచ్చు.

READ ALSO : Unstoppable With NBK 2 : పవన్ ను విమర్శించే వాళ్ళు ఊర కుక్కలతో సమానం..బాలయ్య సంచలనం

Visitors Are Also Reading