Telugu News » Blog » Unstoppable With NBK 2 : పవన్ ను విమర్శించే వాళ్ళు ఊర కుక్కలతో సమానం..బాలయ్య సంచలనం

Unstoppable With NBK 2 : పవన్ ను విమర్శించే వాళ్ళు ఊర కుక్కలతో సమానం..బాలయ్య సంచలనం

by Bunty
Ads

బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో కి ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చి అభిమానులను మెస్మరైజ్ చేశారు. ఈ తరుణంలో ఈ టాక్ షో కి మంగళవారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వేలాది మంది అభిమానులు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేశారు.

Advertisement

వేలాది మంది అభిమానుల మధ్య ఈలలు వేస్తూ కేకల నడుమ కారు దిగివచ్చి పవన్ కళ్యాణ్ బాలకృష్ణను హాగ్ చేసుకున్నాడు. ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూసిన నందమూరి మరియు మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఇక ఈ షోలో పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్ మరియు సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొంటున్నారు. దీంతో ఈ షోకు మంచి ఆదరణ రానుంది.

Advertisement

ఇదంతా పక్కకు పెడితే, ఇక ఈ షోలో బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ మూడు వివాహాల గురించి ఒక ప్రశ్న అడుగుతాడు. ముందుగా బాలయ్య మాట్లాడుతూ ‘ఈ పెళ్లిళ్ల గోల ఏంటయ్యా’ అని పవన్ కళ్యాణ్ ని అడుగుతాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ తాను ఎందుకు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందో చాలా వివరంగా చెప్తాడు. అదంతా విన్న తర్వాత బాలయ్య బాబు మాట్లాడుతూ ‘ఇంత వివరణగా చెప్పిన తర్వాత కూడా, ఈ మ్యాటర్ మీద విమర్శించే వాళ్ళు ఊర కుక్కతో సమానం’ అంటూ బాలయ్య బాబు చెబుతాడు. ఇక త్వరలోనే ఈ షో ప్రోమో కూడా రిలీజ్ కానుంది. ఈ ప్రోమో ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.

Advertisement

READ ALSO : ఏపీ నిరుద్యోగులకు అలర్ట్‌.. 5వ, పదో తరగతి అర్హతతో రాత పరీక్ష ఉద్యోగాలు.. నెలకు రూ.1,10,000ల జీతం..!

You may also like