Telugu News » Blog » సంతానం లేదు… మరీ శరత్‌ బాబు కోట్ల ఆస్తులకు వారసులు ఎవరు..!

సంతానం లేదు… మరీ శరత్‌ బాబు కోట్ల ఆస్తులకు వారసులు ఎవరు..!

by Bunty
Published: Last Updated on
Ads

టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. గత వారం రోజుల్లోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరు ప్రముఖులు మరణించారు. అందులో ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కాగా… మరొకరు శరత్ బాబు. రెండు రోజుల కిందట అనారోగ్యం కారణంగా శరత్ బాబు మరణించారు. ఇక నిన్న చెన్నైలో శరత్ బాబు… అంతక్రియలు జరిగాయి. ప్రముఖుల సమక్షంలో శరత్ బాబు అంతక్రియలను అధికారికంగా నిర్వహించారు.

Advertisement

 

అయితే ఆయన మరణించిన తర్వాత ఆయన గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అందులో ఆయన ఆస్తి విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. శరత్ బాబు కోట్ల ఆస్తి ఉందని మనందరికీ తెలిసిందే. అయితే రమాప్రభ తో విడిపోయిన తర్వాత ఆయన ఒంటరిగానే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు శరత్ బాబుకు సంతానం కూడా లేదు. ఈ తరుణంలోనే శరత్ బాబు ఆస్తులు… ఎవరికి దక్కుతాయనే ప్రశ్నలు నెలకొంది.

Advertisement

అయితే శరత్ బాబు ఆస్తులపై ఆయన చెల్లెలు సరిత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. శరత్ బాబుకు సంతానం లేదని ఆమె పేర్కొన్నారు. తన కూతురు సోనియాను అప్పట్లో దత్తత తీసుకుందామని శరత్ బాబు ప్రయత్నాలు చేశారని ఆమె వెల్లడించారు. కానీ ఆ ప్రక్రియ చివర్లో ఆగిపోయిందని వివరించారు. సోనియా వివాహం కూడా శరత్ బాబు చేశాడని ఆమె చెల్లెలు సరిత పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత ఆయన ఆస్తులు ఎవరికి దక్కుతాయనే దానిపై సరిత ఏం చెప్పలేకపోయారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Hansika: స్టార్ హీరో డేట్ కు వస్తావా అంటూ వేధించాడు.. హన్సిక సంచలన వ్యాఖ్యలు

The Kerala Story : కేరళ స్టోరి సినిమా చూసి ప్రియుడుపై రే*కేసు పెట్టిన ప్రియురాలు

Advertisement

దూసుకొచ్చిన కుక్క, భయంతో 3వ అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్

You may also like