Home » హీరో గోపిచంద్ భార్య ఎవ‌రో తెలుసా..? వాళ్ల ప్రేమక‌థ‌లో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా..?

హీరో గోపిచంద్ భార్య ఎవ‌రో తెలుసా..? వాళ్ల ప్రేమక‌థ‌లో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా..?

by AJAY
Published: Last Updated on
Ad

Gopichand Wife Name, Images: హీరోగా తొలివ‌ల‌పు సినిమాతో ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ అవ్వ‌లేకపోయిన గోపీచంద్ ఆ త‌ర‌వాత నిజం సినిమాతో విల‌న్ గా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాడు. విల‌న్ గా మాత్రం మొద‌టి సినిమాకే ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ త‌ర‌వాత యజ్ఞం సినిమాలో హీరోగా న‌టించి స‌క్సెస్ ను అందుకున్నాడు. య‌జ్ఞం సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో ల‌క్ష్యం, ర‌ణం, గోలీమార్ సినిమాల‌తో వ‌రుస హిట్ ల‌ను అందుకున్నాడు.

Gopichand Hero Wife Name

Advertisement

అయితే గోపించ‌ద్ కు కెరీర్ లో పెద్ద‌గా హిట్ సినిమాలు లేక‌పోయినా క్రేజ్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మ్యాచో మ్యాన్ గా ఎంతో మంది అభిమానుల‌ను గోపిచంద్ సంపాదించుకున్నారు. ఇక టాలీవుడ్ లో ఆయ‌నకు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. ఇదిలా ఉంటే గోపిచంద్ సినిమా జీవితం గురించి చాలా మందికి తెలుసు కానీ ఆయ‌న ప‌ర్స‌నల్ లైఫ్ గురించి ఎవ్వ‌రికీ తెలియ‌దు.

Gopichand Wife Name, Images

Advertisement

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు టి.కృష్ణ న‌ట‌వార‌సుడుగా గోపిచంద్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. టి. కృష్ణ అప్ప‌ట్లో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వహించాడు. గోపిచంద్ 2013వ సంవ‌త్స‌రంలో రేష్మ ను వివాహం చేసుకున్నాడు. రేష్మ కూడా మ‌రెవ‌రో కాదు…హీరో శ్రీకాంత్ అక్క కూతురే రేష్మ‌. అమెరికాలో రేష్మ త‌న చ‌దువును పూర్తి చేసుకుంది.

srikanth

srikanth

రేష్మ ఫోటోను చూసి గోపించ‌ద్ ఇష్ట‌ప‌డి వివాహం చేసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. అంతే కాకుండా ప్ర‌ముఖ న‌టుడు చ‌ల‌ప‌తిరావు హీరో శ్రీకాంత్ తో మాట్లాడి ఈ సంబంధం ను కుదిర్చారు. శ్రీకాంత్ కూడా గోపిచంద్ అన‌గానే చాలా మంచోడు క‌ళ్లు మూసుకుని ఇవ్వ‌చ్చు అని చెప్పి ఒప్పుకున్నాడ‌ట‌. అలా గోపిచంద్ రేష్మ‌ల వివాహం జ‌రిగింది. ప్ర‌స్తుతం గోపిచంద్ రేష్మ‌కు ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా రేష్మ గోపిచంద్ ఎంతో అన్యోన్యంగా క‌లిసి మెలిసి ఉంటున్నారు.

ALSO READ : మహానది మూవీలో కమలహాసన్ కూతురుగా చేసిన అమ్మాయి ఎవరో తెలుసా..!!

Visitors Are Also Reading